తాం కస్యాంచిద్ భవనవలభౌ
శ్లోకః తాం కస్యాంచిద్ భవనవలభౌ సుప్తపారావతాయాం నీత్వా రాత్రిం చిరవిలసనాత్ఖిన్నవిద్యుత్కలత్రః । దృష్టే సూర్యే పునరపి భవాన్ వాహయేదధ్వశేషం మన్దాయన్తే న ఖలు సుహృదామభ్యుపేతార్థకృత్యాః ॥ 1.41 ॥ పదవిభాగః తాం కస్యాంచిద్ భవన - వలభౌ సుప్త - పారావతాయాం నీత్వా రాత్రిం చిర - విలసనాత్ ఖిన్న - విద్యుత్ - కలత్రః । దృష్టే సూర్యే పునః అపి భవాన్ వాహయేత్ అధ్వ - శేషం మన్దాయన్తే న ఖలు సుహృదామ్ అభ్యుపేత - అర్థ - కృత్యాః ॥ అన్వయః చిరవిలసనాత్ ఖిన్నవిద్యుత్కలత్రః భవాన్ కస్యాంచిద్ సుప్తపారావతాయాం భవనవలభౌ తాం రాత్రిం నీత్వా సూర్యే దృష్టే పునరపి అధ్వశేషం వాహయేత్ , సుహృదామ్ అభ్యుపేతార్థకృత్యాః న మన్దాయన్తే ఖలు ॥ 1.41 ॥ ప్రతిపదార్థః చిరవిలసనాత్ = చాలా కాలంగా మెరుస్తూ ఉన్నందున ఖిన్నవిద్యుత్కలత్రః భవాన్ = అలసి ఉన్న మెరుపును భార్యగా ఉన్న వాడవు కస్యాంచిద్ సుప్తపారావతాయాం భవనవలభౌ = ఏదో ఒక పావురాలు నిదురిస్తూ ఉన్న భవనపు పై భాగమున తాం రాత్రిం = ఆ రాత్రిని నీత్వా = గడిపి సూర్యే దృష్టే = సూర్యుడు కనబడినప్పుడు పునరపి = మళ్ళీ అధ్వశేషం = మిగతా మార్గమును వాహయేత్ = నిర్వహించుమ...