గచ్ఛన్తీనాం రమణవసతిం


శ్లోకః
గచ్ఛన్తీనాం రమణవసతిం యోషితాం తత్ర నక్తం
రుద్ధాలోకే నరపతిపథే సూచిభేద్యైస్తమోభిః ।
సౌదామన్యా కనకనికషస్నిగ్ధయా దర్శయోర్వీం
తోయోత్సర్గస్తనితముఖరో మా స్మ భూర్విక్లబాస్తాః 1.40

పదవిభాగః
గచ్ఛన్తీనాం రమణ-వసతిం యోషితాం తత్ర నక్తం రుద్ధ-ఆలోకే నరపతి-పథే సూచి-భేద్యైః తమోభిః ।  సౌదామన్యా కనక-నికష-స్నిగ్ధయా దర్శయ ఉర్వీం తోయ-ఉత్సర్గ-స్తనిత-ముఖరః మా స్మ భూః విక్లబాః తాః

అన్వయః
తత్ర నక్తం సూచిభేద్యైః తమోభిః  రుద్ధాలోకే నరపతిపథే రమణవసతిం గచ్ఛన్తీనాం యోషితాం కనకనికషస్నిగ్ధయా సౌదామన్యా ఉర్వీం దర్శయ, తోయోత్సర్గస్తనితముఖరః మా స్మ భూః, తాః విక్లబాః

ప్రతిపదార్థః
తత్ర = అక్కడ
నక్తం = రాత్రివేళ
సూచిభేద్యైః తమోభిః =సూదితో పొడవదగిన చీకటులతో (సూది మొన కూడా ఛేదించలేనంత దట్టమైన చీకటులతో)
రుద్ధాలోకే నరపతిపథే = చూపు అడ్డగించబడిన రాజమార్గములో
రమణవసతిం = ప్రియుడి ఇంటికి
గచ్ఛన్తీనాం యోషితాం = వెళుతున్న స్త్రీలకు
కనకనికషస్నిగ్ధయా సౌదామన్యా = గీటురాయిపై బంగారపు గీత వంటి మెరుపు రేకతో
ఉర్వీం = భూమిని
దర్శయ = చూపించుము
తోయోత్సర్గస్తనితముఖరః = వర్షగర్జనలను చేసేవాడవు
మా స్మ భూః = కావద్దు సుమా
తాః = వారు
విక్లబాః = బేలలు

తాత్పర్యమ్
అక్కడఉజ్జయినీనగరములోసూది మొన దూరనంత దట్టమైన చీకటి కారణంగా ఏమీ కనబడని రాజమార్గాలలో తమ ప్రియుల గృహాలకు వెళుతూ ఉన్న అభిసారికలకు గీటురాయిపై బంగారపు గీతల వంటి మెరుపులతో నేల కనబడేలా చేయుము. వానల ఉరుములతో ఆ బేలలను ఇంకా బెదరగొట్టకు సుమా!”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...