ప్రాప్యావన్తీనుదయనకథాకోవిదగ్రామవృద్ధాన్


శ్లోకః
ప్రాప్యావన్తీనుదయనకథాకోవిదగ్రామవృద్ధాన్
పూర్వోద్దిష్టామనుసర పురీం శ్రీవిశాలాం విశాలామ్ ।
స్వల్పీభూతే సుచరితఫలే స్వర్గిణాం గాం గతానాం
శేషైః పుణ్యైర్హృతమివ దివః కాన్తిమత్ఖణ్డమేకమ్ 1.31

పదవిభాగః
ప్రాప్య అవన్తీన్ ఉదయన-కథా-కోవిద-గ్రామ-వృద్ధాన్ పూర్వ-ఉద్దిష్టాం అనుసర పురీం శ్రీవిశాలాం విశాలామ్ । స్వల్పీభూతే సుచరిత-ఫలే స్వర్గిణాం గాం గతానాం శేషైః పుణ్యైః హృతమ్ ఇవ కాన్తిమత్ దివః ఖణ్డమ్ ఏకమ్

అన్వయః
ఉదయనకథాకోవిదగ్రామవృద్ధాన్ అవన్తీన్ ప్రాప్య పూర్వోద్దిష్టామ్ శ్రీవిశాలాం విశాలామ్ పురీం అనుసర స్వల్పీభూతే సుచరితఫలే (సతి) గాం గతానాం స్వర్గిణాం శేషైః పుణ్యైః హృతమ్ ఇవ ఏకమ్ కాన్తిమత్ దివః త్ఖణ్డమ్ 1.31

ప్రతిపదార్థః
ఉదయనకథాకోవిదగ్రామవృద్ధాన్ అవన్తీన్ = ఉదయనుడి కథలను చెప్పడంలో నేర్పరులై నృద్ధులు కల అవంతీ గ్రామాలను
ప్రాప్య = చేరుకొని
పూర్వోద్దిష్టామ్ శ్రీవిశాలాం విశాలామ్ పురీం = పూర్వము సూచించిన సంపదలతో నిండిన ఉజ్జయినీ నగరమును
అనుసర = అనుగమించుము
స్వల్పీభూతే సుచరితఫలే (సతి) = పుణ్యము క్షీణించగా
గాం గతానాం = భూమికి చేరుకున్న
స్వర్గిణాం = స్వర్గవాసుల
శేషైః పుణ్యైః = (అనుభవించగా) మిగిలిపోయిన పుణ్యముల చేత
హృతమ్ ఏకం కాన్తిమత్ దివః ఖణ్డమ్ ఇవ (విద్యతే) = తీసుకువచ్చిన కాంతివంతమైన ఒక స్వర్గపు ముక్క వలె ఉన్నది

తాత్పర్యమ్
ఉదయనుడి కథలను చెప్పడంలో నేర్పరులైన వృద్ధులు ఉండే అవంతీదేశపు గ్రామాలను చేరుకొని, అటుపై ఇంతకు మునుపు చెప్పిన సంపద్వంతమైన ఉజ్జయినీ నగరానికి వెళ్ళుము. స్వర్గవాసులైన వారు తమ పుణ్యము క్షీణించాక భూమికి తిరిగి వస్తూ తాము అనుభవించగా మిగిలిన పుణ్యముతో ఇక్కడికి పట్టుకొచ్చిన ఒక వెలిగే స్వర్గపు తునక వలె ఉన్నది ఆ నగరము.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...