రత్నచ్ఛాయావ్యతికర ఇవ
శ్లోకః రత్నచ్ఛాయావ్యతికర ఇవ ప్రేక్ష్యమేతత్పురస్తాద్ వల్మీకాగ్రాత్ ప్రభవతి ధనుఃఖణ్డమాఖణ్డలస్య । యేన శ్యామం వపురతితరాం కాన్తిమాపత్స్యతే తే బర్హేణేవ స్ఫురితరుచినా గోపవేషస్య విష్ణోః॥ 1.15 ॥ పదవిభాగః రత్నః - ఛాయా - వ్యతికర ఇవ ప్రేక్ష్యమ్ ఏతత్ పురస్తాత్ వల్మీక - అగ్రాత్ ప్రభవతి ధనుః - ఖణ్డమ్ ఆఖణ్డలస్య । యేన శ్యామం వపుః అతితరాం కాన్తిమ్ ఆపత్స్యతే తే బర్హేణ ఏవ స్ఫురిత - రుచినా గోప - వేషస్య విష్ణోః ॥ అన్వయః స్ఫురితరుచినా బర్హేణ గోపవేషస్య విష్ణోః ( వపుః ) ఇవ యేన తే శ్యామం వపుః అతితరాం కాన్తిమ్ ఆపత్స్యతే , ( తత్ ) రత్నచ్ఛాయా వ్యతికర ఇవ ప్రేక్ష్యమ్ ఏతత్ ఆఖణ్డలస్య ధనుఃఖణ్డమ్ పురస్తాత్ వల్మీకాగ్రాత్ ప్రభవతి . ప్రతిపదార్థః స్ఫురితరుచినా బర్హేణ = తళతళమను నెమలి ఈకతో గోపవేషస్య విష్ణోః ( వపుః ) ఇవ = కృష్ణరూపధారియైన విష్ణువు యొక్క ( శరీరము ) వలె యేన = దేనితో తే శ్యామం వపుః = నీ నల్లని మేను అతితరాం కాన్తిమ్ = అతిశయించిన కాంతిని ఆపత్స్యతే = పొందుతుందో ( తత్ ) = ( ఆ ) రత్నచ్ఛాయా వ్యతికర ఇవ = మణుల కాంతుల మిశ్రమము వలె ప్రేక్ష్యమ్ ( సత...