తాం చావశ్యమ్



శ్లోకః
తాం చావశ్యం దివసగణనాతత్పరామేకపత్నీమ్
అవ్యాపన్నామవిహతగతిర్ద్రక్ష్యసి భ్రాతృజాయామ్ ।
ఆశాబన్ధః కుసుమసదృశం ప్రాయశో హ్యఙ్గనానామ్
సద్యః పాతి ప్రణయి హృదయం విప్రయోగే రుణద్ధి 1.9

పదవిభాగః
తాం అవశ్యం దివస-గణనా-తత్పరామ్ ఏక-పత్నీమ్ అవ్యాపన్నామ్ అవిహత-గతిః ద్రక్ష్యసి భ్రాతృ-జాయామ్ ఆశా-బన్ధః కుసుమ-సదృశం ప్రాయశః హి అఙ్గనానాం సద్యః-పాతి ప్రణయి హృదయం విప్రయోగే రుణద్ధి

అన్వయః
అవిహతగతిః, (సన్) దివసగణనాతత్పరామ్ ఏకపత్నీమ్ అవ్యాపన్నామ్ భ్రాతృజాయామ్ అవశ్యం ద్రక్ష్యసి. విప్రయోగే సద్యఃపాతి కుసుమసదృశం అఙ్గనానాం ప్రణయి హృదయం ఆశాబన్ధః ప్రాయశః రుణద్ధి హి

ప్రతిపదార్థః
అవిహతగతిః (సన్)= ఏ ఆటంకము లేకుండా వెళ్ళిన వాడవై
దివసగణనాతత్పరామ్ = దినములను లెక్కించడములో నిమగ్నమైన దానిని
ఏకపత్నీమ్ = పతివ్రతను
అవ్యాపన్నామ్ = హానికి లోనవని దానిని
భ్రాతృజాయామ్ = నీ సోదరుడనైన నా యొక్క భార్యను
అవశ్యం = తప్పకుండా
ద్రక్ష్యసి = చూడనున్నావు
విప్రయోగే = వియోగములో
సద్యః = వెంటనే
పాతి = పడిపోయే
కుసుమసదృశం అఙ్గనానాం ప్రణయి హృదయం = పూవు వంటి స్త్రీల ప్రణయ హృదయమును
ఆశాబన్ధః = ఆశ అనే కాడ
ప్రాయశః = చాలా సార్లు
రుణద్ధి హి = నిలబెట్టుతుంది కదా

తాత్పర్యమ్
ఆటంకాలు లేకుండా వెళ్ళి నీవు - నా శాపకాలములోని శేషదినాలను లెక్కిస్తూ సురక్షితంగా ఉన్న పతివ్రతను - మీ వదినను (నా భార్యను) చూడగలవు. విరహకారణంగా తొందరగా పడిపోబోయే ప్రణయినీజీవితకుసుమాన్ని ఆశ అనే కాడ  నిలిపి ఉంచుతుంది కదా.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...