మన్దం మన్దం నుదతి


శ్లోకః
మన్దం మన్దం నుదతి పవనశ్చానుకూలో యథా త్వాం
వామశ్చాయం నదతి మధురం చాతకస్తే సగన్ధః ।
గర్భాధానక్షణపరిచయాన్నూనమాబద్ధమాలాః
సేవిష్యన్తే నయనసుభగం ఖే భవన్తం బలాకాః 1.10
పదవిభాగః
మన్దం మన్దం నుదతి పవనః  అనుకూలః యథా త్వాం వామః  అయం నదతి మధురం చాతకః తే సగన్ధః । గర్భ-ఆధాన-క్షణ-పరిచయాత్ నూనమ్ ఆబద్ధ-మాలాః సేవిష్యన్తే నయన-సుభగం ఖే భవన్తం బలాకాః 
అన్వయః
యథా అనుకూలః పవనః త్వాం మన్దం మన్దం నుదతి అయం సగన్ధః చాతకః తే వామః మధురం నదతి చ  గర్భాధానక్షణపరిచయాత్ఖే ఆబద్ధమాలాః బలాకాః నయనసుభగం భవన్తం సేవిష్యన్తేనూనం 
ప్రతిపదార్థః
యథా =  విధముగా
అనుకూలః పవనః = దక్షిణపవనము (లేదా సదిశలో వీచే గాలి)
త్వాం నిన్ను
మన్దం మన్దం = నెమ్మదిగా
నుదతి = నెట్టుతున్నదో
అయం సగన్ధః చాతకః = (నీబంధువైన  చాతకము
తే వామః నీ ఎడమవైపు
మధురం నదతి చ = తీయగా కూయుచున్నది
గర్భాధానక్షణపరిచయాత్ = గర్భము దాల్చే క్షణమును తెలుసుకొనడం వలన,
ఖే ఆకాశములో
ఆబద్ధమాలాః బలాకాః = బారులు తీరిన బెగ్గురు పక్షులు (కొంగలు)
నయనసుభగం భవన్తం = కంటికి ప్రీతిని కలిగించే నిన్ను
నూనం = తప్పక
సేవిష్యన్తే = సేవించనున్నాయి,.
తాత్పర్యమ్
అనుకూలపవనము వీస్తూ నిన్ను నెమ్మది నెమ్మదిగా నెడుతూ ఉన్నదినీ ఎడమవైపున నీకు బంధువైన చాతకపక్షి తీయగా కూస్తున్నది. (వర్షాగమనసమయమయితాము గర్భము దాల్చే సమయము రానున్నదని గ్రహించిన బెగ్గురు పక్షులు ఆకాశములో దండ అల్లినట్లు బారులు తీరి నిన్ను సేవించనున్నాయి.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...