తస్యోత్సఙ్గే
శ్లోకః
తస్యోత్సఙ్గే ప్రణయిన ఇవ స్రస్తగఙ్గాదుకూలాం
న త్వం దృష్ట్వా న పునరలకాం జ్ఞాస్యసే కామచారిన్ ।
యా వః కాలే వహతి సలిలోద్గారముచ్చైర్విమానా
ముక్తాజాలగ్రథితమలకం కామినీవాభ్రవృన్దమ్ ॥1.66॥
పదవిభాగః
తస్య ఉత్సఙ్గే ప్రణయినః ఇవ స్రస్త-గఙ్గా-దుకూలాం న త్వం దృష్ట్వా న పునః అలకాం జ్ఞాస్యసే కామచారిన్ । యా వః కాలే
వహతి సలిల-ఉద్గారమ్ ఉచ్చైః విమానా ముక్తా-జాల-గ్రథితమ్ అలకం కామినీ ఇవ అభ్ర-వృన్దమ్ ॥
అన్వయః
కామచారిన్, ప్రణయినః ఇవ తస్య ఉత్సఙ్గే
స్రస్తగఙ్గాదుకూలాం అలకాం దృష్ట్వా త్వం పునః న జ్ఞాస్యసే (ఇతి)
న । యా ఉచ్చైః విమానా
వః కాలే సలిలోద్గారమ్ అభ్రవృన్దమ్ కామినీ ముక్తాజాలగ్రథితమ్ అలకం ఇవ వహతి ॥1.66॥
ప్రతిపదార్థః
కామచారిన్ = ఇష్టము ఉన్న చోటికి వెళ్ళగలిగినవాడా
ప్రణయినః ఇవ తస్య ఉత్సఙ్గే = ప్రియుడి వంటి అతడి ఒడిలో
స్రస్తగఙ్గాదుకూలాం = గంగానది అనే జారిపోతున్న వస్త్రము కలది
(అయిన)
అలకాం = అలకా నగరమును
దృష్ట్వా = చూసి
త్వం పునః న జ్ఞాస్యసే (ఇతి) న = నీవు (దానిని) మళ్ళీ జ్ఞాపకము తెచ్చుకోకుండా
ఉండవు
యా = ఎవరైతే
ఉచ్చైః విమానా = ఎత్తైన అంతస్థులతో
వః మీ యొక్క
కాలే = వర్షాకాలములో
సలిలోద్గారమ్ = నీటిని వెలువరించే
అభ్రవృన్దమ్ = మేఘముల గుంపును
కామినీ ముక్తాజాలగ్రథితమ్ ఇవ= ముత్యాల సరములు పొదిగిన స్త్రీల ముంగురులవలె
వహతి = ధరిస్తుందో
తాత్పర్యమ్
“ఓ యథేచ్ఛాసంచారీ, ప్రియుని వంటి కైలాసపర్వతపు ఒడిలో – గంగానది అనే జారిపోతున్న
వస్త్రముతో ఉన్న – అలకానగరాన్ని చూసిన వెంటనే గుర్తుపట్టి తీరుతావు.
ఎత్తైన అంతస్థుల మేడలు గల ఆ నగరం - వానలు కురిసే
వర్షమేఘాలతో - ముంగురులలో ముత్యాలసరాలను ధరించిన స్త్రీ వలె ఉంటుంది.”
Comments
Post a Comment