త్వయ్యాయత్తం కృషిఫలమితి


శ్లోకః
త్వయ్యాయత్తం కృషిఫలమితి భ్రూవికారానభిజ్ఞైః
ప్రీతిస్నిగ్ధైర్జనపదవధూలోచనైః పీయమానః ।
సద్యఃసీరోత్కషణసురభి క్షేత్రమారుహ్య మాలం
కిఞ్చిత్పశ్చాద్ వ్రజ లఘుగతిర్భూయ ఏవోత్తరేణ 1.16


పదవిభాగః
త్వయి-ఆయత్తం కృషి-ఫలమ్ ఇతి భ్రూ-వికార-అనభిజ్ఞైః ప్రీతి-స్నిగ్ధైః జనపద-వధూ-లోచనైః పీయమానః । సద్యఃసీరః ఉత్కషణ-సురభి క్షేత్రమ్ ఆరుహ్య మాలం కిఞ్చిత్ పశ్చాత్ వ్రజ లఘు-గతిః భూయ ఏవ ఉత్తరేణ

అన్వయః
కృషిఫలం త్వయి ఆయత్తమ్ ఇతి భ్రూవికారానభిజ్ఞైః ప్రీతిస్నిగ్ధైః జనపదవధూలోచనైః పీయమానః సద్యఃసీరోత్కషణసురభి క్షేత్రమ్ మాలం ఆరుహ్య కిఞ్చిత్ పశ్చాత్ వ్రజ లఘుగతిః (సన్) భూయ ఉత్తరేణ ఏవ (వ్రజ)

ప్రతిపదార్థః
కృషిఫలం = వ్యవసాయము యొక్క ఫలితము
త్వయి ఆయత్తమ్ ఇతి = నీపై ఆధారపడి ఉన్నదని
భ్రూవికారానభిజ్ఞైః ప్రీతిస్నిగ్ధైః జనపదవధూలోచనైః = కనుబొమల అలంకారమును ఎరగనివీ, ప్రేమతో ఆర్ద్రమైనవి అయిన జానపదకాంతల కన్నులతో
పీయమానః (సన్) = తాగబడుతున్న  వాడవై
మాలం క్షేత్రమ్ = మాలా ప్రాంతమును
సద్యఃసీరోత్కషణసురభి = అప్పుడే దున్నటం చేత మట్టి వాసన (వచ్చే విధంగా)
ఆరుహ్య = ఎక్కి (వర్షించి అనే అర్థంలో ప్రయోగించబడిందిమల్లినాథుడి వ్యాఖ్య)
కిఞ్చిత్ పశ్చాత్ వ్రజ = కొద్దిగా పడమటివైపుకి వెళ్ళుము
భూయ = మళ్ళీ
లఘుగతిః (సన్) = వేగంగా
ఉత్తరేణ ఏవ (వ్రజ) = ఉత్తరదిశలో ప్రయాణించుము

తాత్పర్యమ్
కర్షకుల శ్రమఫలితము నీపై ఆధారపడి ఉన్నదని కనుబొమ్మలను అలంకరించుకోవడం కూడా ఎరుగని అమాయక జానపదవనితలు తమ ప్రేమార్ద్రాలైన కన్నులతో నిన్ను తాగివేస్తూ ఉండగా, అప్పుడే దున్నబడిన మాలా దేశపు భూములలో మట్టి వాసనలను రేపుతూ వానలను కురిపించి, అటుపై కాస్త పడమరకి వెళ్ళి, ఆ తరువాత వేగంగా ఉత్తరదిశలో ప్రయాణించుము.”
(మాల = ఇప్పటి మాల్వా ప్రాంతము అయి ఉండవచ్చునని చెపుతారు)

Comments

Popular posts from this blog

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...