తాముత్తీర్య వ్రజ
శ్లోకః
తాముత్తీర్య వ్రజ పరిచితభ్రూలతావిభ్రమాణాం
పక్ష్మోత్క్షేపాదుపరివిలసత్కృష్ణశారప్రభాణామ్ ।
కున్దక్షేపానుగమధుకరశ్రీముషామాత్మబిమ్బం
పాత్రీకుర్వన్ దశపురవధూనేత్రకౌతూహలానామ్ ॥1.50॥
పదవిభాగః
తామ్ ఉత్తీర్య వ్రజ పరిచిత-భ్రూ-లతా-విభ్రమాణాం పక్ష్మ-ఉత్క్షేపాత్
ఉపరి-విలసత్-కృష్ణ-శార-ప్రభాణామ్ కున్ద-క్షేప-అనుగ-మధుకర-శ్రీ-ముషామ్ ఆత్మ-బిమ్బం పాత్రీకుర్వన్
దశ-పురవధూ-నేత్ర-కౌతూహలానామ్
॥
అన్వయః
తామ్ ఉత్తీర్య పరిచితభ్రూలతావిభ్రమాణాం పక్ష్మోత్క్షేపాత్ ఉపరివిలసత్కృష్ణశారప్రభాణామ్
కున్దక్షేపానుగమధుకరశ్రీముషామ్ దశపురవధూనేత్రకౌతూహలానామ్
ఆత్మబిమ్బం పాత్రీకుర్వన్ వ్రజ ॥1.50॥
ప్రతిపదార్థః
తామ్ = దానిని (ఆ చర్మణ్వతీనదిని)
ఉత్తీర్య = దాటి
పరిచిత… కౌతూహలానామ్ >
పరిచితభ్రూలతావిభ్రమాణాం
= సుపరిచితమైన సన్నని కనుబొమల కులుకులు కలిగినవీ
పక్ష్మోత్క్షేపాత్ = కనుబొమలను పైకెత్తడం వలన
ఉపరివిలసత్కృష్ణశారప్రభాణామ్ = పైకి ప్రసరిస్తూ ఉన్న నల్లని/వివిధవర్ణాల కాంతులను
కలిగినవీ
కున్దక్షేపానుగమధుకరశ్రీముషామ్ = ఊగే మల్లెలను అనుసరిస్తున్న తుమ్మెదల సొబగును
దొంగిలిస్తున్నటువంటివీ (అయిన)
దశపురవధూనేత్రకౌతూహలానామ్
= దశపురవనితల కన్నుల కుతూహలమునకు
ఆత్మబిమ్బం = నీ నీడను
పాత్రీకుర్వన్ = పాత్రము చేసి
వ్రజ = వెళ్ళుము
తాత్పర్యమ్
“ఆ చర్మణ్వతీనదిని దాటి - తీగల వలె సన్నగా ఉన్న కనుబొమల అలంకారాలను బాగా తెలిసినవీ,
కనుబొమ్మలను పైకెత్తడం చేత నానావర్ణకాంతులని పైకెగజిమ్ముతున్నవీ, ఊగే మల్లెలననుసరించే
తుమ్మెదల అందముతో పోటీ పడగలిగినవీ అయిన దశపురపు స్త్రీల కన్నుల కుతూహలాన్ని తీర్చి
సాగిపొమ్ము.”
(దశపురము రంతిదేవుని రాజధాని; చర్మణ్వతి ఇప్పటి చంబల్ నది)
Comments
Post a Comment