నీవీబన్ధోచ్ఛ్వసితశిథిలం
శ్లోకః నీవీబన్ధోచ్ఛ్వసితశిథిలం యత్ర బిమ్బాధరాణాం క్షౌమం రాగాదనిభృతకరేష్వాక్షిపత్సు ప్రియేషు । అర్చిస్తుఙ్గానభిముఖమపి ప్రాప్య రత్నప్రదీపాన్ హ్రీమూఢానాం భవతి విఫలప్రేరణా చూర్ణముష్టిః ॥ 2.07 ॥ పదవిభాగః నీవీ - బన్ధ - ఉచ్ఛ్వసిత - శిథిలం యత్ర బిమ్బ - అధరాణాం క్షౌమం రాగాత్ అనిభృత - కరేషు ఆక్షిపత్సు ప్రియేషు । అర్చిః తుఙ్గాన్ - అభిముఖమ్ అపి ప్రాప్య రత్న - ప్రదీపాన్ హ్రీ - మూఢానాం భవతి విఫల - ప్రేరణా చూర్ణ - ముష్టిః ॥ అన్వయః యత్ర అనిభృతకరేషు ప్రియేషు నీవీబన్ధోచ్ఛ్వసితశిథిలం క్షౌమం రాగాత్ అక్షిపత్సు ( సత్సు ) హ్రీమూఢానాం బిమ్బాధరాణాం చూర్ణముష్టిః అర్చిస్తుఙ్గాన్ రత్నప్రదీపాన్ అభిముఖమ్ ప్రాప్య అపి విఫలప్రేరణా భవతి ॥ 2.07 ॥ ప్రతిపదార్థః యత్ర = ఎక్కడ ( ఏ అలకాపురిలోనైతే ) రాగాత్ = అనురాగముతో అనిభృతకరేషు ప్రియేషు ఆక్షిపత్సు ( సత్సు ) = చపలమైన చేతులు గల ప్రియులు తొలగిస్తూ ఉండగా నీవీబన్ధోచ్ఛ్వసితశిథిలం క్షౌమం = ముడి సడలిన పట్టుబట్ట గల వారు ( అయిన ) హ్రీమూఢానాం బిమ్బాధరాణాం = సిగ్గుతో ఏమి చేయాలో తోచని వారైన , దొండపం...