నీవీబన్ధోచ్ఛ్వసితశిథిలం
శ్లోకః
నీవీబన్ధోచ్ఛ్వసితశిథిలం యత్ర బిమ్బాధరాణాం
క్షౌమం రాగాదనిభృతకరేష్వాక్షిపత్సు ప్రియేషు ।
అర్చిస్తుఙ్గానభిముఖమపి ప్రాప్య రత్నప్రదీపాన్
హ్రీమూఢానాం భవతి విఫలప్రేరణా చూర్ణముష్టిః ॥2.07॥
పదవిభాగః
నీవీ-బన్ధ-ఉచ్ఛ్వసిత-శిథిలం
యత్ర బిమ్బ-అధరాణాం క్షౌమం రాగాత్ అనిభృత-కరేషు ఆక్షిపత్సు ప్రియేషు । అర్చిః తుఙ్గాన్-అభిముఖమ్
అపి ప్రాప్య రత్న-ప్రదీపాన్ హ్రీ-మూఢానాం
భవతి విఫల-ప్రేరణా చూర్ణ-ముష్టిః ॥
అన్వయః
యత్ర అనిభృతకరేషు ప్రియేషు నీవీబన్ధోచ్ఛ్వసితశిథిలం క్షౌమం రాగాత్ అక్షిపత్సు (సత్సు) హ్రీమూఢానాం బిమ్బాధరాణాం చూర్ణముష్టిః అర్చిస్తుఙ్గాన్
రత్నప్రదీపాన్ అభిముఖమ్ ప్రాప్య అపి విఫలప్రేరణా భవతి ॥2.07॥
ప్రతిపదార్థః
యత్ర = ఎక్కడ (ఏ అలకాపురిలోనైతే)
రాగాత్ = అనురాగముతో
అనిభృతకరేషు ప్రియేషు ఆక్షిపత్సు (సత్సు) = చపలమైన చేతులు గల ప్రియులు తొలగిస్తూ ఉండగా
నీవీబన్ధోచ్ఛ్వసితశిథిలం క్షౌమం = ముడి సడలిన పట్టుబట్ట గల వారు (అయిన)
హ్రీమూఢానాం బిమ్బాధరాణాం = సిగ్గుతో ఏమి చేయాలో తోచని వారైన,
దొండపండు వంటి పెదవులు కలవారి యొక్క
చూర్ణముష్టిః = కుంకుమధూళితోనున్న పిడికిలి
అర్చిస్తుఙ్గాన్ రత్నప్రదీపాన్ = మిక్కుటముగా వెలుగుతున్న
రత్నదీపాలను
అభిముఖమ్ = ఎదురుగా
ప్రాప్య అపి = పొందినప్పటికీ (సమీపించినప్పటికీ)
విఫలప్రేరణా = నిష్ఫలమవుతున్న విసురు కలది
భవతి = అవుతున్నదో
తాత్పర్యమ్
“ఆ నగరములోని ప్రియులు ఊరికే ఉండని తమ చేతులతో తొలగిస్తూ ఉండగా పోకముడులు సడలిన
సుందరులు , సిగ్గు పడుతూ గుప్పిళ్ళతో చల్లిన కుంకుమ ఉజ్జ్వలంగా
ప్రకాశిస్తున్న రత్నదీపాలను ఆర్పలేకపోతుంది.”
Comments
Post a Comment