మన్దాకిన్యాః సలిలశిశిరైః


శ్లోకః
మన్దాకిన్యాః సలిలశిశిరైః సేవ్యమానా మరుద్భి-
ర్మన్దారాణామనుతటరుహాం ఛాయయా వారితోష్ణాః ।
అన్వేష్టవ్యైః కనకసికతాముష్టినిక్షేపగూఢైః
సఙ్క్రీడన్తే మణిభిరమరప్రార్థితా యత్ర కన్యాః 2.06

పదవిభాగః
మన్దాకిన్యాః సలిల-శిశిరైః సేవ్యమానాః మరుద్భిః మన్దారాణామ్ అనుతట-రుహాం ఛాయయా వారిత-ఉష్ణాః । అన్వేష్టవ్యైః కనక-సికతా-ముష్టి-నిక్షేప-గూఢైః సఙ్క్రీడన్తే మణిభిః అమర-ప్రార్థితా యత్ర కన్యాః

అన్వయః
యత్ర అమరప్రార్థితాః కన్యాః మన్దాకిన్యాః సలిలశిశిరైః మరుద్భిః వారితోష్ణాః  అనుతటరుహాం మన్దారాణామ్ ఛాయయా సేవ్యమానాః అన్వేష్టవ్యైః కనకసికతాముష్టినిక్షేపగూఢైః మణిభిః సఙ్క్రీడన్తే 2.06

ప్రతిపదార్థః
యత్ర = ఎక్కడైతే
అమరప్రార్థితాః కన్యాః = అమరులచేత కోరబడే కన్యలు
మన్దాకిన్యాః = మందాకినీ నది యొక్క
సలిలశిశిరైః మరుద్భిః = నీటిచేత చల్లబడిన గాలులతో
వారితోష్ణాః (సత్యః) = పోగొట్టబడిన వేడిని కల వారు (అయి)
అనుతటరుహాం మన్దారాణామ్ = (ఆ నదీ) తీరమును అనుసరించి పెరుగుతున్న మందారవృక్షముల
ఛాయయా = నీడతో
సేవ్యమానాః = సేవించబడుతున్న వారు (అయి)
అన్వేష్టవ్యైః కనకసికతాముష్టినిక్షేపగూఢైః మణిభిః = వెదకదగినట్టివి, బంగారు ఇసుకలో పిడికిళ్ళ క్రింద దాచబడినవి అయిన మణులతో
సఙ్క్రీడన్తే = ఆడుకుంటారో

తాత్పర్యమ్
అక్కడ నివసించే కన్యలు ఆకాశగంగాజలాలచేత చల్లబడిన గాలులతో సేవించబడుతూ, ఆ నదీతీరము వెంబడి పెరిగిన మందారవృక్షాల నీడలలో బంగారు ఇసుకలలో పిడికిళ్ళ క్రింద దాచిన మణులను వెదికి పట్టుకునే ఆటను ఆడుతుంటారు.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...