యస్యాం యక్షాః
శ్లోకః
యస్యాం యక్షాః సితమణిమయాన్యేత్య హర్మ్యస్థలాని
జ్యోతిశ్ఛాయాకుసుమరచితాన్యుత్తమస్త్రీసహాయాః ।
ఆసేవన్తే మధు రతిఫలం కల్పవృక్షప్రసూతం
త్వద్గమ్భీరధ్వనిషు శనకైః పుష్కరేష్వాహతేషు ॥2.05॥
పదవిభాగః
యస్యాం యక్షాః సిత-మణి-మయాని ఏత్య హర్మ్య-స్థలాని జ్యోతిః-ఛాయా-కుసుమ-రచితాని ఉత్తమ-స్త్రీ-సహాయాః ।
ఆసేవన్తే మధు రతి-ఫలం కల్ప-వృక్ష-ప్రసూతం త్వత్ గమ్భీర-ధ్వనిషు శనకైః పుష్కరేషు ఆహతేషు
॥
అన్వయః
యస్యాం ఉత్తమస్త్రీసహాయాః యక్షాః సితమణిమయాని జ్యోతిశ్ఛాయాకుసుమరచితాని హర్మ్యస్థలాని
ఏత్య త్వత్ గమ్భీరధ్వనిషు శనకైః పుష్కరేషు ఆహతేషు కల్పవృక్షప్రసూతం మధు రతిఫలం
ఆసేవన్తే ॥2.05॥
ప్రతిపదార్థః
యస్యాం = దేనిలో (ఏ నగరములో)
ఉత్తమస్త్రీసహాయాః యక్షాః = ఉత్తమురాండ్రైన స్త్రీలు తోడుగా ఉన్న
యక్షులు
సితమణిమయాని = తెల్లని మణులతో (చంద్రకాంతమణులతో)
నిండినవి
జ్యోతిశ్ఛాయాకుసుమరచితాని = నక్షత్రాలు ప్రతిఫలించిన పూవులను ఏర్పరచుతున్నవి
హర్మ్యస్థలాని = మేడలను (మేడల పైకి)
ఏత్య = వెళ్ళి
శనకేశు ఆహతేషు త్వత్ పుష్కరేషు = పుష్కలములు అనే నీ యొక్క
మేఘములు మంద్రముగా కొట్టబడుతుండగా (మ్రోగించబడుతుండగా)
కల్పవృక్షప్రసూతం = కల్పవృక్షమునుంచి పుట్టినది
మధు రతిఫలం = తీయనిది అయిన రతిఫలము అనే మధువును
ఆసేవన్తే = సేవిస్తారు
తాత్పర్యమ్
“ఆ నగరములోని యక్షులు ఉత్తమస్త్రీలతో కలిసి చంద్రకాంతమణులతో పొదగబడి తారకల తళుకుల
ప్రతిఫలనాల పూవులతోనున్న మేడలపైకి వెళ్ళి అక్కడ మీ పుష్కలములు అనే మేఘములు మంద్రముగా
మ్రోగుతుండగా కల్పవృక్షజన్యమైన రతిఫలము అనే పేరు గల మధువును సేవిస్తూ ఉంటారు.”
Comments
Post a Comment