మార్గం తావచ్ఛృణు


శ్లోకః
మార్గం తావచ్ఛృణు కథయతస్త్వత్ప్రయాణానురూపమ్
సన్దేశం మే తదను జలద శ్రోష్యసి శ్రోత్రపేయమ్ ।
ఖిన్నః ఖిన్నః శిఖరిషు పదం న్యస్య గన్తాసి యత్ర
క్షీణః క్షీణః పరిలఘు పయః స్రోతసాం చోపభుజ్య 1.13

పదవిభాగః
మార్గం తావత్ శ్రుణు కథయతః త్వత్-ప్రయాణ-అనురూపం సందేశం మే తదను జలద శ్రోష్యసి శ్రోత్రపేయమ్ ఖిన్నః ఖిన్నః శిఖరిషు పదం న్యస్య గన్తాసి యత్ర, క్షీణః క్షీణః పరిలఘు పయః స్రోతసాం చ ఉపభుజ్య

అన్వయః
జలద, కథయతః (మే) త్వత్-ప్రయాణానురూపం మార్గం తావత్ శ్రుణు యత్ర ఖిన్నః ఖిన్నః (సన్) శిఖరిషు పదం న్యస్య క్షీణః క్షీణః (సన్) స్రోతసాం పరిలఘు పయః చ ఉపభుజ్య గన్తాసి   తదను శ్రోత్రపేయమ్మే సందేశం శ్రోష్యసి

ప్రతిపదార్థః
జలద = ఓ జలదా
తావత్ = ఇప్పుడు
కథయతః మే = చెప్పుచున్న నా నుంచి
త్వత్-ప్రయాణానురూపం మార్గం = నీ ప్రయాణానికి అనువైన మార్గమును
శ్రుణు = వినుము
యత్ర = ఎక్కడైతే
ఖిన్నః ఖిన్నః (సన్) = అలిసిపోయినవాడవై
శిఖరిషు = శిఖరములపై
పదం న్యస్య = పాదమును మోపి
క్షీణః క్షీణః (సన్)= బలము క్షీణించిన వాడవై
స్రోతసాం = నదుల/ప్రవాహముల
పరిలఘు పయః చ = కొద్దిపాటి నీటిని
ఉపభుజ్య = త్రాగి
గన్తాసి = వెళ్ళనున్నావో
తదను = ఆ తరువాత
శ్రోత్రపేయమ్మే సందేశం = చెవులతో త్రాగదగ్గది అయిన నా సందేశమును
శ్రోష్యసి = విననున్నావు

తాత్పర్యమ్
ఓ మేఘుడా, అలసిన వేళలలో కొండ కొమ్ములపై కాలూనుతూ, సన్నబడినప్పుడు నదీజలాలను త్రాగుతూ నీవు ప్రయాణింపబోవనున్న మార్గపు వివరాలను వినుము. అటుపై చెవులకింపు అయిన నా సందేశాన్ని విందువు గానీ.”

Comments

Popular posts from this blog

తస్యోత్సఙ్గే

తాముత్తీర్య వ్రజ

ప్రాప్యావన్తీనుదయనకథాకోవిదగ్రామవృద్ధాన్