అద్రేః శృఙ్గం హరతి పవనః
శ్లోకః
అద్రేః శృఙ్గం హరతి పవనః కింస్విదిత్యున్ముఖీభిర్-
దృష్టోత్సాహశ్చకితచకితం ముగ్ధసిద్ధాఙ్గనాభిః ।
స్థానాదస్మాత్ సరసనిచులాదుత్పతోదఙ్ముఖః ఖం
దిఙ్నాగానాం పథి పరిహరన్ స్థూలహస్తావలేపాన్ ॥1.14॥
పదవిభాగః
అద్రేః శృఙ్గం హరతి పవనః కిం స్విద్ ఇతి ఉత్-ముఖీభిః దృష్ట-ఉత్సాహః చకిత-చకితం ముగ్ధ-సిద్ధ-అఙ్గనాభిః స్థానాత్ అస్మాత్ సరస-నిచులాత్ ఉత్పత ఉదక్-ముఖః ఖం దిక్-నాగానాం పథి పరిహరన్ స్థూల-హస్త-అవలేపాన్.
అన్వయః
“పవనః అద్రేః శృఙ్గం హరతి కిం స్విద్?” ఇతి
ఉన్ముఖీభిః ముగ్ధసిద్ధాఙ్గనాభిః చకితచకితం దృష్టోత్సాహః (సన్)
ఉదఙ్ముఖః (సన్) అస్మాత్ సరసనిచులాద్
స్థానాద్ పథి దిఙ్నాగానాం స్థూలహస్తావలేపాన్ పరిహరన్
ఖం ఉత్పత.
ప్రతిపదార్థః
పవనః = గాలి
అద్రేః
శృఙ్గం = కొండ కొమ్మును
హరతి కిం
స్విద్ = ఎత్తుకెళుతున్నాడా ఏమిటి
ఇతి = అని
ఉన్ముఖీభిః
ముగ్ధసిద్ధాఙ్గనాభిః = తలలు పైకెత్తిన అమాయక సిద్ధవనితల చేత
చకితచకితం
= సంభ్రమాశ్చర్యములు కలుగునట్లు
దృష్టోత్సాహః
(సన్) = చూడబడుతూ ఉత్సాహమును పొందినవాడవై
ఉదఙ్ముఖః (సన్) = ఉత్తరాభిముఖుడవై
అస్మాత్
సరసనిచులాద్ స్థానాద్ = బెత్తము చెట్లతో చిత్తడిగా నున్న ఈ స్థానము
నుంచి
పథి = త్రోవలో
దిఙ్నాగానాం
= దిగ్గజాల యొక్క
స్థూలహస్తావలేపాన్ = తొండముల మొఱటు విసురులను
పరిహరన్ = త్రోసివేస్తూ (పట్టించుకోకుండా)
ఖం ఉత్పత = ఆకాశములోనికి ఎగయుము
తాత్పర్యమ్
“గాలి కొండకొమ్మును ఎత్తుకుపోతున్నదా
ఏమి?” అని అమాయకురాండ్రైన సిద్ధ వనితలు భయసంభ్రమాలతో తలలు పైకెత్తి
చూస్తూ ఉండగా, ఉత్సాహాన్ని పొంది బెత్తపు చెట్లతో నిండి చిత్తడిగా
ఉన్న ఈ ప్రాంతము నుంచి ఆకాశానికి ఎగిసి దిగ్గజాల తొండపు ఆక్షేపణలను లెక్కపెట్టకుండా
వెళ్ళుము.
Comments
Post a Comment