రత్నచ్ఛాయావ్యతికర ఇవ
శ్లోకః
రత్నచ్ఛాయావ్యతికర ఇవ ప్రేక్ష్యమేతత్పురస్తాద్
వల్మీకాగ్రాత్ ప్రభవతి ధనుఃఖణ్డమాఖణ్డలస్య ।
యేన శ్యామం వపురతితరాం కాన్తిమాపత్స్యతే తే
బర్హేణేవ స్ఫురితరుచినా గోపవేషస్య విష్ణోః॥1.15॥
పదవిభాగః
రత్నః-ఛాయా-వ్యతికర ఇవ ప్రేక్ష్యమ్ ఏతత్ పురస్తాత్
వల్మీక-అగ్రాత్ ప్రభవతి ధనుః-ఖణ్డమ్ ఆఖణ్డలస్య
। యేన శ్యామం వపుః అతితరాం కాన్తిమ్ ఆపత్స్యతే
తే బర్హేణ ఏవ స్ఫురిత-రుచినా గోప-వేషస్య విష్ణోః
॥
అన్వయః
స్ఫురితరుచినా బర్హేణ గోపవేషస్య విష్ణోః (వపుః) ఇవ యేన తే శ్యామం వపుః అతితరాం కాన్తిమ్ ఆపత్స్యతే, (తత్) రత్నచ్ఛాయా వ్యతికర ఇవ ప్రేక్ష్యమ్ ఏతత్ ఆఖణ్డలస్య ధనుఃఖణ్డమ్ పురస్తాత్ వల్మీకాగ్రాత్ ప్రభవతి.
ప్రతిపదార్థః
స్ఫురితరుచినా బర్హేణ = తళతళమను నెమలి ఈకతో
గోపవేషస్య విష్ణోః (వపుః) ఇవ = కృష్ణరూపధారియైన విష్ణువు
యొక్క (శరీరము) వలె
యేన = దేనితో
తే శ్యామం వపుః = నీ నల్లని మేను
అతితరాం కాన్తిమ్ = అతిశయించిన కాంతిని
ఆపత్స్యతే = పొందుతుందో
(తత్) =
(ఆ)
రత్నచ్ఛాయా వ్యతికర ఇవ = మణుల కాంతుల మిశ్రమము వలె
ప్రేక్ష్యమ్ (సత్) = చూడదగినదైన
ఏతత్ ఆఖణ్డలస్య ధనుఃఖణ్డమ్ = ఈ ఇంద్రధనుస్సులోని ఒక ముక్క
పురస్తాత్ వల్మీకాగ్రాత్ = ఎదురుగానున్న పుట్ట నుంచి
ప్రభవతి = పుట్టుతున్నది
తాత్పర్యమ్
“రత్నకాంతులను
కలబోసుకున్నట్లున్నది, చూడదగ్గదీ అయిన ఇంద్రధనువు తునుక ఒకటి
నా ఎదురుగా ఉన్న పుట్ట నుంచి పుట్టుకువస్తున్నది. నెమలీక తళతళలలో
కృష్ణుడి శరీరము వలెనే నీ దేహము కూడా ఈ ఐంద్రకార్ముకఖండము వలన మరింత కాంతిని పొందనున్నది.”
Comments
Post a Comment