కర్తుం యచ్చ ప్రభవతి


శ్లోకః
కర్తుం యచ్చ ప్రభవతి మహీముచ్ఛిలీన్ధ్రామవన్ధ్యామ్
తచ్ఛ్రుత్వా తే శ్రవణసుభగం గర్జితం మానసోత్కాః ।
ఆకైలాసాద్ బిసకిసలయచ్ఛేదపాథేయవన్తః
సమ్పత్స్యన్తే నభసి భవతో రాజహంసాః సహాయాః॥1.11

పదవిభాగః
కర్తుం యత్ చ ప్రభవతి మహీమ్ ఉత్-శిలీన్ధ్రామ్ అవన్ధ్యామ్ తత్ శ్రుత్వా తే శ్రవణసుభగం గర్జితం మానసోత్కాః ।
ఆ కైలాసాత్ బిస-కిసలయః-ఛేద-పాథేయవన్తః సమ్పత్స్యన్తే నభసి భవతః రాజహంసాః సహాయాః

అన్వయః
యత్ మహీమ్ ఉచ్ఛిలీన్ధ్రామ్ అవన్ధ్యామ్ చ కర్తుం ప్రభవతి తత్ తే శ్రవణసుభగం గర్జితం శ్రుత్వా మానసోత్కాః రాజహంసాః
బిసకిసలయచ్ఛేదపాథేయవన్తః ఆకైలాసాద్ నభసి భవతః సహాయాః సమ్పత్స్యన్తే ॥

ప్రతిపదార్థః
యత్ = ఏది
మహీమ్ = భూమిని
ఉచ్ఛిలీన్ధ్రామ్ = మొలచిన పుట్టగొడుగులను కలిగినదానిగా
అవన్ధ్యామ్ చ = మరియు సంతానవతిగా
కర్తుం = చేయుటకు
ప్రభవతి = పుట్టునో
తత్ =
తే = నీ
శ్రవణసుభగం గర్జితం = చెవికింపైన ఉరుమును
శ్రుత్వా = విని
మానసోత్కాః రాజహంసాః = మానససరోవరమునకు పోవాలని ఆరాటపడుతున్న రాజహంసలు
బిసకిసలయచ్ఛేదపాథేయవన్తః (సన్తః) = తామరతూడు ముక్కలను దారి బత్తెముగా స్వీకరించినవి (అయి)
ఆకైలాసాద్ = కైలాసపర్వతము వరకు
నభసి = ఆకాశములో
భవతః సహాయాః= నీ సహప్రయాణీకులు
సమ్పత్స్యన్తే = కానున్నాయి

తాత్పర్యమ్
పుట్టగొడుగులను మొలిపించి భూమిని సంతానవతిగా చేయగల నీ ఉరుము చప్పుడును చెవులవిందుగా విన్న రాజహంసలు మానససరోవరమునకు వెళ్లవలెనన్న ఆతురతతో లేత తామరతూడు ముక్కలను దారిబత్తెముగా చేసుకొని కైలాసశిఖరము వరకు నీకు తోడుగా ప్రయాణించనున్నాయి.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...