ఆపృచ్ఛస్వ ప్రియసఖమముం


శ్లోకః
ఆపృచ్ఛస్వ ప్రియసఖమముం తుఙ్గమాలిఙ్గ్య శైలమ్
వన్ద్యైః పుంసాం రఘుపతిపదైరఙ్కితం మేఖలాసు ।
కాలే కాలే భవతి భవతా యస్య సంయోగమేత్య
స్నేహవ్యక్తిశ్చిరవిరహజం ముఞ్చతో బాష్పముష్ణమ్ 1.12

పదవిభాగః
ఆపృచ్ఛస్వ ప్రియ-సఖమ్ అముం తుఙ్గమ్ ఆలిఙ్గ్య శైలమ్ వన్ద్యైః పుంసాం రఘు-పతి-పదైః అఙ్కితం మేఖలాసు । కాలే కాలే భవతి భవతా యస్య సంయోగమ్ ఏత్య స్నేహ-వ్యక్తిః చిర-విరహజం ముఞ్చతః బాష్పమ్ ఉష్ణమ్

అన్వయః
కాలే కాలే భవతా సంయోగమ్ ఏత్య చిరవిరహజం ఉష్ణమ్బాష్పమ్ ముఞ్చతః యస్య స్నేహవ్యక్తిః భవతి పుంసాం వన్య్దైః రఘుపతిపదైః మేఖలాసు అఙ్కితం, ప్రియసఖం అముం తుఙ్గమ్ శైలం ఆలిఙ్య్గ ఆపృచ్ఛస్వ

ప్రతిపదార్థః
కాలే కాలే = అప్పుడప్పుడు (ప్రతి వర్షర్తువుకు)
భవతా = నీతో
సంయోగమ్ = కలయికను
ఏత్య = పొంది
చిరవిరహజం ఉష్ణమ్బాష్పమ్ = చిరకాలవిరహము నుంచి పుట్టిన వెచ్చని కన్నీటిని
ముఞ్చతః యస్య = వదులుతున్న రామగిరి యొక్క
స్నేహవ్యక్తిః = స్నేహప్రకటనము
భవతి = అవుతున్నదో
పుంసాం = నరులకు
వన్య్దైః రఘుపతిపదైః = నమస్కరించదగినట్టివైన శ్రీరాముడి అడుగులతో
మేఖలాసు = కొండ చరియలలో
అఙ్కితం = ముద్రితమై ఉన్నటువంటిది
ప్రియసఖమ్ అముం తుఙ్గమ్ శైలం = ప్రియమైన స్నేహితుడైన ఈ ఎత్తైన కొండను
ఆలిఙ్య్గ = కౌగిలించుకొని
ఆపృచ్ఛస్వ = సెలవు తీసుకొనుము

తాత్పర్యమ్
అప్పుడప్పుడు (ఏడాదికొకసారి, నీతో కలయిక ఒనగూడి, చిరకాలవిరహం కారణంగా వెచ్చని కన్నీటిని కారుస్తూ తన స్నేహభావాన్ని వ్యక్తం చేస్తున్నది ఈ రామగిరి. సకలజనవంద్యుడైన రామచంద్రుని పాదముద్రలతో దీని చరియలు పావనమైనాయి. నీ ప్రియమిత్రమైన ఈ పర్వతాన్ని దగ్గరగా తీసుకొని నీ ప్రయాణానికి అనుమతిని పొందుము.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...