పశ్చాదుచ్చైర్భుజతరువనం
శ్లోకః
పశ్చాదుచ్చైర్భుజతరువనం మణ్డలేనాభిలీనః
సాన్ధ్యం తేజః ప్రతినవజపాపుష్పరక్తం దధానః ।
నృత్యారమ్భే హర పశుపతేరార్ద్రనాగాజినేచ్ఛాం
శాన్తోద్వేగస్తిమితనయనం దృష్టభక్తిర్భవాన్యా ॥1.39॥
పదవిభాగః
పశ్చాత్ ఉచ్చైః భుజ-తరు-వనం మణ్డలేన అభిలీనః సాన్ధ్యం తేజః
ప్రతినవజపాపుష్పరక్తం దధానః । నృత్య-ఆరమ్భే హర పశుపతేః ఆర్ద్ర-నాగ-అజిన-ఇచ్ఛాం శాన్త-ఉద్వేగ-స్తిమిత-నయనం దృష్టభక్తిః
భవాన్యా ॥
అన్వయః
పశ్చాత్ పశుపతేః నృత్యారమ్భే ఉచ్చైః భుజతరువనం ప్రతినవజపాపుష్పరక్తం సాన్ధ్యం
తేజః దధానః మణ్డలేన అభిలీనః (సన్) భవాన్యా శాన్తోద్వేగస్తిమితనయనం దృష్టభక్తిః (సన్)
(తస్య) ఆర్ద్రనాగాజినేచ్ఛాం హర ॥
ప్రతిపదార్థః
పశ్చాత్ = ఆ తరువాత
పశుపతేః = శివుడి యొక్క
నృత్యారమ్భే = నృత్యారంభ సమయములో
ఉచ్చైః భుజతరువనం = ఎత్తైన భుజములనే చెట్ల అరణ్యమునును
ప్రతినవజపాపుష్పరక్తం సాన్ధ్యం తేజః = మందారపుష్పాలను పోలిన ఎరుపుగల
సాయంకాలపు వెలుగును
దధానః = ధరించినవాడివై
మణ్డలేన అభిలీనః (సన్)= వృత్తాకారములో వ్యాపించినవాడవై
భవాన్యా = భవాని చేత
శాన్తోద్వేగస్తిమితనయనం దృష్టభక్తిః = భయము తొలగి స్తిమితపడిన
కన్నులతో చూడబడిన భక్తి కలవాడివై(సన్)
(తస్య) ఆర్ద్రనాగాజినేచ్ఛాం = ఆ శివుడి యొక్క పచ్చి ఏనుగు చర్మముపై కోరికను
హర = పోగొట్టుము
తాత్పర్యమ్
“ఆ తరువాత, పరమశివుడు తాండవం చేయబోతుండగా,
మందారపు ఎరుపుతోనున్న సాయంకాలపు వెలుతురును ధరించి - ఉద్వేగమును వీడిన కన్నులతో పార్వతి నీ భక్తిని చూస్తూ ఉండగా - ఆ పశుపతి యొక్క ఎత్తైన భుజాల చెట్ల
అడవి చుట్టూ వ్యాపించి, నెత్తుటితో తడిసిన ఏనుగు తోలును కప్పుకోవాలన్న
అతడి కోరికను పోగొట్టుము.”
Comments
Post a Comment