జాలోద్గీర్ణైః కేశసంస్కారధూపైః
శ్లోకః
జాలోద్గీర్ణైరుపచితవపుః కేశసంస్కారధూపై-
ర్బన్ధుప్రీత్యా భవనశిఖిభిర్దత్తనృత్యోపహారః ।
హర్మ్యేష్వస్యాః కుసుమసురభిష్వధ్వఖేదం నయేథా
లక్ష్మీం పశ్యన్ లలితవనితాపాదరాగాఙ్కితేషు ॥1.35॥
పదవిభాగః
జాల-ఉద్గీర్ణైః ఉపచిత-వపుః
కేశ-సంస్కార-ధూపైః బన్ధుప్రీత్యా భవనశిఖిభిః దత్త-నృత్య-ఉపహారః । హర్మ్యేషు
అస్యాః కుసుమ-సురభిషు అధ్వ-ఖేదం నయేథాః లక్ష్మీం పశ్యన్ లలిత-వనితా-పాద-రాగ-అఙ్కితేషు ॥
అన్వయః
జాలోద్గీర్ణైః కేశసంస్కారధూపైః ఉపచితవపుః (భూత్వా) బన్ధుప్రీత్యా భవనశిఖిభిః దత్తనృత్యఉపహారః
(సన్) అస్యాః కుసుమసురభిషు
హర్మ్యేషు లలితవనితాపాదరాగాఙ్కితేషు లక్ష్మీం
పశ్యన్ అధ్వఖేదం నయేథాః ॥1.35॥
ప్రతిపదార్థః
జాలోద్గీర్ణైః కేశసంస్కారధూపైః = గవాక్షముల నుంచి
వెలువడుతున్న సాంబ్రాణి వంటి వస్తువుల పొగలతో
ఉపచితవపుః (భూత్వా) = పుష్టి చెందిన శరీరము కలవాడవై
బన్ధుప్రీత్యా = బంధుప్రీతితో
భవనశిఖిభిః = భవనములలోని (పెంపుడు) నెమళ్ళ చేత
దత్తనృత్యఉపహారః (సన్) = నృత్యములను
కానుకగా ఈయబడినవాడవై
కుసుమసురభిషు లలితవనితాపాదరాగాఙ్కితేషు = పూల వాసనలతో,
సుందరమైన స్త్రీల పాదముల ఎర్రని ముద్రలతో ఉన్న్న సౌధములలో
అస్యాః = ఈ (నగరము యొక్క)
లక్ష్మీం పశ్యన్ = సంపదను చూస్తూ
అధ్వఖేదం = మార్గాయాసమును
నయేథాః =పోగొట్టుకొనుము
తాత్పర్యమ్
“ఆ నగరపు వనితాకేశసంస్కారార్థము ఉపయోగించిన సాంబ్రాణి వంటి సుగంధద్రవ్యాల పొగలు
వారి భవనగవాక్షాల నుంచి వెలువడుతుండగా – వాటితో నీ దేహాన్ని పరిపుష్టం చేసుకొని, ఆ
భవనాలలోని పెంపుడు నెమళ్ళు బంధుప్రీతితో నీకు నృత్యముల కానుకను స్వీకరించి, పూల పరిమళాలతో
నిండి, సుందరీమణూల పాదాల లత్తుక గుర్తులతో ఉన్న ఆ భవనాలలో ఆ నగరపు వైభవాన్ని పరికిస్తూ
నీ బడలికను తీర్చుకో.”
Comments
Post a Comment