ప్రద్యోతస్య ప్రియదుహితరం


శ్లోకః
ప్రద్యోతస్య ప్రియదుహితరం వత్సరాజోఽత్ర జహ్రే
హైమం తాలద్రుమవనమభూదత్ర తస్యైవ రాజ్ఞః ।
అత్రోద్భ్రాన్తః కిల నలగిరిః స్తమ్భముత్పాట్య దర్పా-
దిత్యాగన్తూన్ రమయతి జనో యత్ర బన్ధూనభిజ్ఞః ॥1.34

పదవిభాగః
ప్రద్యోతస్య ప్రియ-దుహితరం వత్స-రాజః అత్ర జహ్రే హైమం తాల-ద్రుమ-వనమ్ అభూత్ అత్ర తస్య వ రాజ్ఞః అత్ర ద్భ్రాన్తః కిల నలగిరిః స్తమ్భమ్ ఉత్పాట్య దర్పాత్ ఇతి ఆగన్తూన్ రమయతి జనః యత్ర బన్ధూన్ అభిజ్ఞః ॥

అన్వయః
“అత్ర వత్సరాజః ప్రద్యోతస్య ప్రియదుహితరం జహ్రే, త్ర ఏవ తస్య రాజ్ఞః హైమం తాలద్రుమవనమ్ అభూత్, అత్ర నలగిరిః దర్పాత్ స్తమ్భమ్ ఉత్పాట్య ద్భ్రాన్తః కిల ఇతి యత్ర భిజ్ఞః జనః గన్తూన్ బన్ధూన్ రమయతి ॥

ప్రతిపదార్థః
త్ర = ఇక్కడ
వత్సరాజః = వత్సదేశపు రాజు (ఉదయనుడు)
ప్రద్యోతస్య = ప్రద్యోతుడి యొక్క
ప్రియదుహితరం = ప్రియమైన కుమార్తెను
జహ్రే = ఎత్తుకుపోయాడు
త్ర ఏవ = ఇక్కడే
స్య రాజ్ఞః = ఆ రాజు యొక్క
హైమం తాలద్రుమవనమ్ = హైమవనము అనే తాటి తోపు (లేదా బంగారపు తాటి తోపు)
భూత్ = ఉండేది
అత్ర = ఇక్కడ
నలగిరిః = నలగిరి అనే ఏనుగు
దర్పాత్ = మదముతో
స్తమ్భమ్ = స్తంభమును
త్పాట్య = ఊడలాగి
ద్భ్రాన్తః కిల = విచ్చలవిడిగా విహరించింది కదా
ఇతి = అని
యత్ర = ఎక్కడ
భిజ్ఞః జనః = తెలిసి ఉన్న ఆడు
గన్తూన్ బన్ధూన్ = (చూడ) వచ్చిన బంధువులను
రమయతి = వినోదింపజేస్తాడో

తాత్పర్యమ్
““ఇక్కడే వత్సదేశపు రాజైన ఉదయనుడు (ఉజ్జయినికి రాజైన) ప్రద్యోతుడి కుమార్తెయైన వాసవదత్తను ఎత్తుకెళ్ళాడు. ఇక్కడే ఆ రాజు యొక్క (ప్రద్యోతుడి) హైమవనము అనే తాటి తోపు ఉండేది. నలగిరి అనే ఏనుగు మదించి స్తంభాన్ని పెరికి విచ్చలవిడిగా తిరిగింది ఇక్కడే కదా” అని చెప్పుతూ ఈ విషయాలను తెలిసిన పౌరుడు తమను చూడవచ్చిన బంధువులను వినోదింపచేసేది ఎక్కడో...”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...