వేణీభూతప్రతనుసలిలా


శ్లోకః
వేణీభూతప్రతనుసలిలా తామతీతస్య సిన్ధుః
పాణ్డుచ్ఛాయాతటరుహతరుభ్రంశిభిర్జీర్ణపర్ణైః
సౌభాగ్యం తే సుభగ విరహావస్థయా వ్యఞ్జయన్తీ
కార్శ్యం యేన త్యజతి విధినా స త్వయైవోపపాద్యః 1.30

పదవిభాగః
వేణీభూత-ప్రతను-సలిలా తామ్ అతీతస్య సిన్ధుః పాణ్డుః-ఛాయా-తట-రుహ-తరు-భ్రంశిభిః జీర్ణ-పర్ణైః । సౌభాగ్యం తే సుభగ విరహ-అవస్థయా వ్యఞ్జయన్తీ కార్శ్యం యేన త్యజతి విధినా సః త్వయా-ఏవ ఉపపాద్యః

అన్వయః
సుభగ, తామ్ అతీతస్య తే సౌభాగ్యం వేణీభూతప్రతనుసలిలా పాణ్డుచ్ఛాయాతటరుహతరుభ్రంశిభిః జీర్ణపర్ణైః విరహావస్థయా వ్యఞ్జయన్తీ సిన్ధుః యేన విధినా కార్శ్యం త్యజతి స త్వయా ఏవ ఉపపాద్యః 1.30

ప్రతిపదార్థః
సుభగ = అదృష్టము కలవాడా
తామ్ = ఆమెను (నిర్వింధ్యానదిని)
అతీతస్య తే = దాటిన నీ యొక్క
సౌభాగ్యం = అదృష్టమును
వేణీభూతప్రతనుసలిలా = సన్నని పాయవంటి నీటితో
తటరుహతరుభ్రంశిభిః జీర్ణపర్ణైః = ఒడ్డున పెరిగిన చెట్లనుంచి రాలిన పండుటాకులతో
పాణ్డుచ్ఛాయా = పాలిపోయినది
విరహావస్థయా = విరహము చేత
వ్యఞ్జయన్తీ సిన్ధుః = ప్రకటిస్తున్న సింధువు అనే నది
యేన విధినా = ఏ విధంగా అయితే
కార్శ్యం = కృశించిపోవడాన్ని
త్యజతి = వదిలిపెడుతుందో
సః = అది
త్వయా ఏవ = నీ చేతనే
ఉపపాద్యః = చేయదగి ఉన్నది

తాత్పర్యమ్
ఓ భాగ్యశాలీ, నిర్వింధ్యానదిని దాటాక, సన్నని పాయలా ప్రవహిస్తూ ఉన్న సింధూనదిని చూస్తావు. ఒడ్డున ఉన్న చెట్లనుంచి పడిన పండుటాకులతో పాలిపోయినట్లుండి నీ గురించి విరహములో ఉండి నీ అదృష్టాన్ని ప్రకటిస్తూ ఉన్న ఆ నది కృశత్వము తొలగిపోయేలా చేయుము.”
(తామతీతస్యదీనికి సాత్వతీతస్య అని పాఠాంతరం ఉన్నది. తామ్ అతీతస్య అన్నప్పుడునిర్వింధ్యను దాటి అని అర్థంసా అతీతస్యఅని పాఠం తీసుకున్నప్పుడు సా = నిర్వింధ్యా నది; అతీతస్య = చిరకాలంగా దూరదేశగతుడైన మేఘుడి యొక్క అని వ్యాఖ్యానిస్తారు. “వీచిక్షోభస్తనిత”... శ్లోకంలో నిర్వింధ్య శృంగారవిలాసాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆ తరువాతదైన ఈ శ్లోకంలో విరహావస్థను వ్యజించడం అంత సబబుగా అనిపించదు; సింధు అనే నది మాల్వా ప్రాంతములోని కాళీ సింధు నది అయి ఉండవచ్చును. – కోసూరి వీరనరసింహరాజు గారి వ్యాఖ్య నుంచి.)

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...