పాదన్యాసైః క్వణితరశనాః
శ్లోకః
పాదన్యాసైః క్వణితరశనాస్తత్ర లీలావధూతై
రత్నచ్ఛాయాఖచితవలిభిశ్చామరైః క్లాన్తహస్తాః ।
వేశ్యాస్త్వత్తో నఖపదసుఖాన్ ప్రాప్య వర్షాగ్రబిన్దూన్
ఆమోక్ష్యన్తే త్వయి మధుకరశ్రేణిదీర్ఘాన్ కటాక్షాన్ ॥1.38॥
పదవిభాగః
పాద-న్యాసైః క్వణిత-రశనాః తత్ర లీలా-అవధూతైః రత్నః-ఛాయా-ఖచిత-వలిభిః చామరైః క్లాన్త-హస్తాః । వేశ్యాః త్వత్తః నఖ-పద-సుఖాన్ ప్రాప్య వర్ష-అగ్ర-బిన్దూన్ ఆమోక్ష్యన్తే త్వయి మధుకర-శ్రేణి-దీర్ఘాన్ కట-అక్షాన్ ॥
అన్వయః
తత్ర పాదన్యాసైః క్వణితరశనాః లీలావధూతైః
రత్నచ్ఛాయాఖచితవలిభిశ్చామరైః క్లాన్తహస్తాః వేశ్యాః త్వత్తః నఖపదసుఖాన్ వర్షాగ్రబిన్దూన్ ప్రాప్య త్వయి మధుకరశ్రేణిదీర్ఘాన్ కటాక్షాన్
ఆమోక్ష్యన్తే ॥1.38॥
ప్రతిపదార్థః
తత్ర = అప్పుడు (ఆ సంధ్యాసమయంలో)
పాదన్యాసైః = మోపబడిన పాదముల చేత
క్వణితరశనాః = శబ్దము చేస్తున్న వడ్డాణములు కలవారు
లీలావధూతైః రత్నచ్ఛాయాఖచితవలిభిశ్చామరైః = విలాసముగా ఊపుతున్నటువంటి
రత్నకాంతులతోనున్న చామరముల పిడుల చేత
క్లాన్తహస్తాః = అలసిన చేతులు కలవారు (అయిన)
వేశ్యాః = వేశ్యలు (ఆలయాన నృత్యం చేసే గణికలు)
త్వత్తః = నీ నుంచి
నఖపదసుఖాన్ వర్షాగ్రబిన్దూన్ = నఖక్షతములకు హాయిని గూర్చే తొలి వాన చినుకులను
ప్రాప్య =పొంది
త్వయి = నీ యందు
మధుకరశ్రేణిదీర్ఘాన్ కటాక్షాన్ = తుమ్మెదల వరుస వంటి దీర్ఘమైన కడగంటి చూపులను
ఆమోక్ష్యన్తే = ప్రసరింపజేస్తారు
తాత్పర్యమ్
“ఆ (సంధ్యాపూజా) సమయములో, అడుగులను మోపడం చేత గలగలమనే వడ్డాణాలను పెట్టుకొని, కరకంకణాల
మణిదీప్తులు తాపడం చేసినట్లున్న చామరాలను లీలగా ఊపుతూ ఉన్నందున చేతులు అలిసిపోయి ఉన్నఉన్న
ఆలయగణికలు తమ నఖక్షతదేహాలకు హాయి గొలిపే వాన చినుకులను నీ నుంచి పొంది తుమ్మెదల బారుల
వంటి నిడుపాటి చూపులను నీపై ప్రసరింపజేస్తారు.”
Comments
Post a Comment