తాం కస్యాంచిద్ భవనవలభౌ

శ్లోకః
తాం కస్యాంచిద్ భవనవలభౌ సుప్తపారావతాయాం
నీత్వా రాత్రిం చిరవిలసనాత్ఖిన్నవిద్యుత్కలత్రః
దృష్టే సూర్యే పునరపి భవాన్ వాహయేదధ్వశేషం
మన్దాయన్తే న ఖలు సుహృదామభ్యుపేతార్థకృత్యాః 1.41

పదవిభాగః
తాం కస్యాంచిద్ భవన-వలభౌ సుప్త-పారావతాయాం నీత్వా రాత్రిం చిర-విలసనాత్ ఖిన్న-విద్యుత్-కలత్రః దృష్టే సూర్యే పునః అపి భవాన్ వాహయేత్ అధ్వ-శేషం మన్దాయన్తే న ఖలు సుహృదామ్ అభ్యుపేత-అర్థ-కృత్యాః

అన్వయః
చిరవిలసనాత్ ఖిన్నవిద్యుత్కలత్రః  భవాన్ కస్యాంచిద్ సుప్తపారావతాయాం భవనవలభౌ తాం రాత్రిం నీత్వా సూర్యే దృష్టే పునరపి అధ్వశేషం వాహయేత్, సుహృదామ్ అభ్యుపేతార్థకృత్యాః న మన్దాయన్తే ఖలు ॥1.41

ప్రతిపదార్థః
చిరవిలసనాత్ = చాలా కాలంగా మెరుస్తూ ఉన్నందున
ఖిన్నవిద్యుత్కలత్రః భవాన్ = అలసి ఉన్న మెరుపును భార్యగా ఉన్న వాడవు
కస్యాంచిద్ సుప్తపారావతాయాం భవనవలభౌ = ఏదో ఒక పావురాలు నిదురిస్తూ ఉన్న భవనపు పై భాగమున
తాం రాత్రిం = ఆ రాత్రిని
నీత్వా = గడిపి
సూర్యే దృష్టే = సూర్యుడు కనబడినప్పుడు
పునరపి = మళ్ళీ
అధ్వశేషం = మిగతా మార్గమును
వాహయేత్ = నిర్వహించుము
సుహృదామ్ = స్నేహితుల యొక్క
అభ్యుపేతార్థకృత్యాః = పనులను పూర్తి చేస్తామని ఒప్పుకున్నవారు
న మన్దాయన్తే ఖలు = ఆలస్యము చేయరు కదా

తాత్పర్యమ్
మెరిసీ మెరిసీ అలిసిపోతుంది విద్యుత్తు అనే నీ భార్య. (అందుచేత ఆ రాత్రికి ఉజ్జయినీలోనే విశ్రమించుము.). పావురాలు నిదురించే ఏదో ఒక భవనాగ్రాన ఆ రాత్రిని గడిపి, పొద్దు పొడవగానే మిగతా ప్రయాణాన్ని కొనసాగించుము. మిత్రుల ప్రయోజనాలను సాధించిపెట్టేవారు జాగు చేయరు కదా!” 

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...