దీర్ఘీకుర్వన్ పటు మదకలం


శ్లోకః
దీర్ఘీకుర్వన్ పటు మదకలం కూజితం సారసానాం
ప్రత్యూషేషు స్ఫుటితకమలామోదమైత్రీకషాయః ।
యత్ర స్త్రీణాం హరతి సురతగ్లానిమఙ్గానుకూలః
శిప్రావాతః ప్రియతమ ఇవ ప్రార్థనాచాటుకారః 1.32

పదవిభాగః
దీర్ఘీకుర్వన్ పటు మద-కలం కూజితం సారసానాం ప్రత్యూషేషు స్ఫుటిత-కమల-ఆమోద-మైత్రీ-కషాయః । యత్ర స్త్రీణాం హరతి సురత-గ్లానిమ్ అఙ్గ-అనుకూలః శిప్రా-వాతః ప్రియతమః ఇవ ప్రార్థనా-చాటుకారః

అన్వయః
యత్ర ప్రత్యూషేషు పటు మదకలం సారసానాం కూజితం దీర్ఘీకుర్వన్ స్ఫుటితకమలామోదమైత్రీకషాయః అఙ్గానుకూలః శిప్రావాతః ప్రార్థనాచాటుకారః ప్రియతమః ఇవ స్త్రీణాం సురతగ్లానిమ్ హరతి 1.32

ప్రతిపదార్థః
యత్ర = ఎక్కడ
ప్రత్యూషేషు = తెలవారుజామున
పటు = స్ఫుటమైన (స్పష్టమైన)
మదకలం సారసానాం కూజితం = హంసలు చేస్తున్న మత్తుతో కూడిన శబ్దమును
దీర్ఘీకుర్వన్ = విస్తరింపజేస్తూ
స్ఫుటితకమలామోదమైత్రీకషాయః  = వికసించిన తామర పూవుల తావితో పరిమళిస్తున్నది
అఙ్గానుకూలః = శరీరమునకు సుఖమును కలిగించేది
శిప్రావాతః = శిప్రానది గాలి
ప్రార్థనాచాటుకారః = (సురతార్థము) అభ్యర్థిస్తున్న
ప్రియతమః ఇవ = ప్రియుడివలె
స్త్రీణాం = స్త్రీల యొక్క
సురతగ్లానిమ్ = రతిశ్రమను
హరతి = తొలగిస్తుందో

తాత్పర్యమ్
ఎక్కడ (ఏ ఉజ్జయినిలో) శిప్రానది పై నుంచి వీచే గాలి, స్ఫుటముగా వినిపిస్తూ ఉన్న హంసల మదకలస్వనాన్ని విస్తరింపజేస్తూ, విచ్చిన తామరల తావితో ఒంటికి హాయి గొలుపుతూ - (పునః సురతార్థము) సానునయ వాక్యాలతో ప్రార్థిస్తూ ఉన్న ప్రియుడి వలెసంభోగశ్రమను తొలగిస్తుందో...”

Comments

Post a Comment

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...