భర్తుః కణ్ఠచ్ఛవిరితి
శ్లోకః
భర్తుః కణ్ఠచ్ఛవిరితి గణైః సాదరం వీక్ష్యమాణః
పుణ్యం యాయాస్త్రిభువనగురోర్ధామ చణ్డీశ్వరస్య ।
ధూతోద్యానం కువలయరజోగన్ధిభిర్గన్ధవత్యా-
స్తోయక్రీడానిరతయువతిస్నానతిక్తైర్మరుద్భిః ॥1.36॥
పదవిభాగః
భర్తుః కణ్ఠః-ఛవిః ఇతి గణైః సాదరం వీక్ష్యమాణః పుణ్యం
యాయౌ త్రి-భువన-గురోః ధామ చణ్డీ-ఈశ్వరస్య । ధూత-ఉద్యానం కువలయ-రజః-గన్ధిభిః
గన్ధవత్యాః తోయ-క్రీడా-నిరత-యువతి-స్నాన-తిక్తైః మరుద్భిః ॥
అన్వయః
“భర్తుః కణ్ఠఃఛవిః” ఇతి గణైః సాదరం
వీక్ష్యమాణః (సన్) కువలయరజోగన్ధిభిః
తోయక్రీడానిరతయువతిస్నానతిక్తైః గన్ధవత్యాః
మరుద్భిః ధూతోద్యానం త్రిభువనగురోః చణ్డీశ్వరస్య పుణ్యం ధామ యాయౌ । ॥1.36॥
ప్రతిపదార్థః
భర్తుః = యజమాని అయిన శివుడి యొక్క
కణ్ఠచ్ఛవిః ఇతి = మెడ తాలూకు రంగు అని
గణైః = ప్రమథగణముల చేత
సాదరం = ఆదరముతో
వీక్ష్యమాణః (సన్) = చూడబడి
కువలయరజోగన్ధిభిః = కలువల పుప్పొడుల చేత
తోయక్రీడానిరతయువతిస్నానతిక్తైః =జలక్రీడలలో ఆసక్తి గల యువతుల
స్నానద్రవ్యముల పరిమళముతో కూడిన
గన్ధవత్యాః = గంధవతీనది యొక్క
మరుద్భిః = వాయువులతో
ధూతోద్యానం = కంపిస్తూ ఉన్న తోట కలిగినది (అయిన)
త్రిభువనగురోః చణ్డీశ్వరస్య = ముల్లోకములకు
తండ్రియైన చండీశ్వరుడి యొక్క
పుణ్యం ధామ = పుణ్యప్రదమైన నివాసమునకు
యాయౌ = వెళ్ళుము
తాత్పర్యమ్
“మా యజమాని యొక్క మెడ రంగును పోలి ఉన్నాడీ మేఘుడు.” అని ప్రమథగణాలు నిన్ను ఆదరముతో
చూస్తూ ఉండగా, ముజ్జగములకు తండ్రియైన చండీశ్వరుడి పుణ్యప్రదమైన గుడికి వెళ్ళుము. కలువల
పుప్పొడులతో, జలక్రీడాసక్తయువతుల స్నానద్రవ్యసువాసనలతోనున్న గంధవతీనది గాలులలో ఉయ్యాలలూగుతూ
ఉంటాయి, ఆ మందిరపు ఉద్యానవనాలు.”
Comments
Post a Comment