అప్యన్యస్మిన్

శ్లోకః
అప్యన్యస్మిఞ్జలధర మహాకాలమాసాద్య కాలే
స్థాతవ్యం తే నయనవిషయం యావదత్యేతి భానుః ।
కుర్వన్ సన్ధ్యాబలిపటహతాం శూలినః శ్లాఘనీయామ్
ఆమన్ద్రాణాం ఫలమవికలం లప్స్యసే గర్జితానామ్ ॥1.37

పదవిభాగః
పి అన్యస్మిన్ జలధర మహాకాలమ్ ఆసాద్య కాలే స్థాతవ్యం తే నయన-విషయం యావత్ అత్యేతి భానుః । కుర్వన్ సన్ధ్యా-బలి-పటహతాం శూలినః శ్లాఘనీయామ్ ఆమన్ద్రాణాం ఫలమ్ అవికలం లప్స్యసే గర్జితానామ్ ॥

అన్వయః
లధర, న్యస్మిన్ కాలే మహాకాలమ్ ఆసాద్య అపి (తావత్) తే స్థాతవ్యం యావత్ భానుః నయనవిషయం త్యేతి, శూలినః శ్లాఘనీయామ్ సన్ధ్యాబలిపటహతాం కుర్వన్ ఆమన్ద్రాణాం గర్జితానామ్ వికలం ఫలమ్ లప్స్యసే ॥1.37॥

ప్రతిపదార్థః
లధర = మేఘమా
న్యస్మిన్ కాలే = మరి ఏ ఇతర సమయమందు
మహాకాలమ్ =మహాకాళ మందిరమును
సాద్య అపి = చేరినప్పటికీ
(తావత్) = అప్పటి దాకా
తే = నీకు
స్థాతవ్యం = ఉండదగినది
యావత్ = ఎప్పటిదాకా అంటే
భానుః = సూర్యుడు
నయనవిషయం త్యేతి = కనుచూపు మేరను దాటుతాడో
శూలినః = శివుడికి
శ్లాఘనీయామ్ = ప్రశంసించదగ్గ
సన్ధ్యాబలిపటహతాం కుర్వన్ = సాయంకాలపు పూజలో నగారా వలె
ఆమన్ద్రాణాం గర్జితానామ్ = కొంచెము గంభీరముగా ఉరుము చప్పుళ్ళకు
వికలం ఫలమ్ = సంపూర్ణమైన ఫలితమును
లప్స్యసే = పొందగలవు

తాత్పర్యమ్
“మేఘుడా, సంధ్యాసమయపూర్వము నీవు (చండీశ్వరుడి నివాసమైన) మహాకాళమందిరమునకు చేరుకొన్నప్పటికీ, సూర్యుడు కనుచాటు అయ్యేదాకా ఆగి శివుడికి జరిపే సాయంకాలపూజలో నగారా వలె మంద్రగంభీరమైన ఉరుముల చప్పుడును చేసి సంపూర్ణమైన పుణ్యఫలాన్ని పొందగలవు.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...