హారాంస్తారాంస్తరలగుటికాన్


శ్లోకః
హారాంస్తారాంస్తరలగుటికాన్ కోటిశః శఙ్ఖశుక్తీః
ఘాసశ్యామాన్ మరకతమణీనున్మయూఖప్రరోహాన్ ।
దృష్ట్వా యస్యాం విపణిరచితాన్ విద్రుమాణాం చ భఙ్గాన్
సంలక్ష్యన్తే సలిలనిధయస్తోయమాత్రావశేషాః 1.33

పదవిభాగః
హారాన్ తారాన్ తరల-గుటికాన్ కోటిశః శఙ్ఖ-శుక్తీః ఘాస-శ్యామాన్ మరకతమణీన్ ఉత్-మయూఖ-ప్రరోహాన్ । దృష్ట్వా యస్యాం విపణి-రచితాన్ విద్రుమాణాం చ భఙ్గాన్ సంలక్ష్యన్తే సలిల-నిధయః తోయమాత్ర-అవశేషాః

అన్వయః
యస్యాం విపణిరచితాన్ కోటిశః తారాన్ తరలగుటికాన్ హారాన్ శఙ్ఖశుక్తీః ఘాసశ్యామాన్ మరకతమణీన్ ఉన్మయూఖప్రరోహాన్  విద్రుమాణాం భఙ్గాన్ చ దృష్ట్వా సలిలనిధయః తోయమాత్రావశేషాః సంలక్ష్యన్తే 1.33

ప్రతిపదార్థః
యస్యాం = ఏ నగరంలో
విపణిరచితాన్ = అంగడులలో అమర్చిన
తారాన్ తరలగుటికాన్ హారాన్ = మెరుగు పెట్టబడినవి, మెరుస్తున్న మణులు పఒదగబడినవి అయిన ముత్యాల హారములను
కోటిశః = కోట్లాది
శఙ్ఖశుక్తీః = శంఖములను, ముత్యపు చిప్పలను
ఘాసశ్యామాన్ ఉన్మయూఖప్రరోహాన్ మరకతమణీన్ = లేత గడ్డిపరకల రంగులో, పైకి ఎగసే కిరణాలను కలిగినవైన పచ్చలను
విద్రుమాణాం భఙ్గాన్ చ = ఇంకా పగడపు ముక్కలను
దృష్ట్వా = చూసి
సలిలనిధయః = సముద్రములు
తోయమాత్రావశేషాః = కేవలము నీటి మాత్రమే మిగుల్చుకున్నవిగా
సంలక్ష్యన్తే = తెలుసుకోబడతాయి

తాత్పర్యమ్
ఏ నగరపు అంగళ్ళలో కోట్లాదిగా అమర్చిన మెరుగుపెట్టబడ్డ మణిమయహారాలను, శంఖాలను, ముత్యపు చిప్పలను, లేత గరిక రంగు కిరణాలను ఎగజిమ్ముతున్న గరుడపచ్చలను, పగడపు ముక్కలను చూసినప్పుడు సముద్రములలో నీళ్ళు మాత్రమే మిగిలాయని అనిపిస్తుందో...”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...