హిత్వా తస్మిన్ భుజగవలయం
శ్లోకః హిత్వా తస్మిన్ భుజగవలయం శమ్భునా దత్తహస్తా క్రీడాశైలే యది చ విచరేత్పాదచారేణ గౌరీ । భఙ్గీభక్త్యా విరచితవపుః స్తమ్భితాన్తర్జలౌఘః సోపానత్వం కురు మణితటారోహణాయాగ్రయాయీ ॥ 1.63 ॥ పదవిభాగః హిత్వా తస్మిన్ భుజగ - వలయం శమ్భునా దత్త - హస్తా క్రీడా - శైలే యది చ విచరేత్ పాదచారేణ గౌరీ । భఙ్గీ - భక్త్యా విరచిత - వపుః స్తమ్భిత - అన్తర్జల - ఓఘః సోపానత్వం కురు మణి - తట - ఆరోహణాయ అగ్ర - యాయీ ॥ అన్వయః తస్మిన్ క్రీడాశైలే భుజగవలయం హిత్వా చ శమ్భునా దత్తహస్తా గౌరీ పాదచారేణ విచరేత్ యది ( త్వం ) స్తమ్భితాన్తర్జలౌఘః అగ్రయాయీ భఙ్గీభక్త్యా విరచితవపుః మణితటారోహణాయ సోపానత్వం కురు ॥ 1.63 ॥ ప్రతిపదార్థః తస్మిన్ క్రీడాశైలే = ఆ క్రీడాపర్వతమునందు భుజగవలయం = పాముల కంకణమును హిత్వా చ = వదిలిపెట్టి శమ్భునా = శివుని చేత దత్తహస్తా = చేయి ఈయబడినది ( అయిన ) గౌరీ = పార్వతీదేవి పాదచారేణ = కాలి నడకతో విచరేత్ యది = విహరిస్తున్నట్లయితే స్తమ్భితాన్తర్జలౌఘః ( త్వం ) = లోపల ఉండే నీటిని బిగబట్టిన వాడవు ( అయిన నీవు ) అగ్రయాయీ ( సన్ ) = ముందు నడచినవాడవు ( అయి ) భఙ్గీభక్త్యా = మెట్ల...