హిత్వా తస్మిన్ భుజగవలయం


శ్లోకః
హిత్వా తస్మిన్ భుజగవలయం శమ్భునా దత్తహస్తా
క్రీడాశైలే యది చ విచరేత్పాదచారేణ గౌరీ ।
భఙ్గీభక్త్యా విరచితవపుః స్తమ్భితాన్తర్జలౌఘః
సోపానత్వం కురు మణితటారోహణాయాగ్రయాయీ 1.63

పదవిభాగః
హిత్వా తస్మిన్ భుజగ-వలయం శమ్భునా దత్త-హస్తా క్రీడా-శైలే యది చ విచరేత్ పాదచారేణ గౌరీ । భఙ్గీ-భక్త్యా విరచిత-వపుః స్తమ్భిత-అన్తర్జల-ఓఘః సోపానత్వం కురు మణి-తట-ఆరోహణాయ అగ్ర-యాయీ

అన్వయః
తస్మిన్ క్రీడాశైలే భుజగవలయం హిత్వా చ శమ్భునా దత్తహస్తా గౌరీ పాదచారేణ విచరేత్ యది (త్వం) స్తమ్భితాన్తర్జలౌఘః అగ్రయాయీ భఙ్గీభక్త్యా విరచితవపుః మణితటారోహణాయ సోపానత్వం కురు 1.63

ప్రతిపదార్థః
తస్మిన్ క్రీడాశైలే = ఆ క్రీడాపర్వతమునందు
భుజగవలయం = పాముల కంకణమును
హిత్వా చ = వదిలిపెట్టి
శమ్భునా = శివుని చేత
దత్తహస్తా = చేయి ఈయబడినది (అయిన)
గౌరీ = పార్వతీదేవి
పాదచారేణ = కాలి నడకతో
విచరేత్ యది = విహరిస్తున్నట్లయితే
స్తమ్భితాన్తర్జలౌఘః (త్వం) = లోపల ఉండే నీటిని బిగబట్టిన వాడవు (అయిన నీవు)
అగ్రయాయీ (సన్) = ముందు నడచినవాడవు (అయి)
భఙ్గీభక్త్యా = మెట్ల ఆకారంలో
విరచితవపుః (సన్)= అమర్చిన శరీరము కలవాడవు అయి
మణితటారోహణాయ = మణులతో పొదగబడిన ప్రదేశమును ఎక్కుటకు
సోపానత్వం = మెట్టుదనమును
కురు = చేయుము (పొందుము)

తాత్పర్యమ్
శివపార్వతులకు క్రీడాస్థలమైన ఆ కైలాసములో, శివుడు తన భుజంగకంకణమును విడిచిపెట్టి అందించిన చేయూతతో పార్వతి కాలినడకన విహరిస్తూ ఉంటే, వారికి ముందుగా నడుస్తూ, నీలో ఉండే నీటిని బిగబట్టి, మణులతో పొదగబడ్డ (విహార)ప్రదేశమును ఎక్కేందుకు వీలుగా నీ శరీరాన్ని మెట్లవలె అమర్చుము.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...