ఉత్పశ్యామి త్వయి తటగతే

శ్లోకః
ఉత్పశ్యామి త్వయి తటగతే స్నిగ్ధభిన్నాఞ్జనాభే
సద్యః కృత్తద్విరదదశనచ్ఛేదగౌరస్య తస్య ।
శోభామద్రేః స్తిమితనయనప్రేక్షణీయాం భవిత్రీమ్
అంసన్యస్తే సతి హలభృతో మేచకే వాససీవ 1.62

పదవిభాగః
ఉత్పశ్యామి త్వయి తట-గతే స్నిగ్ధ-భిన్న-అఞ్జన-ఆభే సద్యః కృత్త-ద్విరద-దశనః-ఛేద-గౌరస్య తస్య । శోభామ్ అద్రేః స్తిమిత-నయన-ప్రేక్షణీయాం భవిత్రీమ్ అంసన్యస్తే సతి హల-భృతః మేచకే వాససి ఇవ

అన్వయః
స్నిగ్ధభిన్నాఞ్జనాభే త్వయి తటగతే సతి సద్యః కృత్తద్విరదదశనచ్ఛేదగౌరస్య తస్య అద్రేః శోభామ్ హలభృతః అంసన్యస్తే మేచకే వాససి సతి (శోభామ్) ఇవ స్తిమితనయనప్రేక్షణీయాం భవిత్రీమ్ ఉత్పశ్యామి 1.62

ప్రతిపదార్థః
స్నిగ్ధభిన్నాఞ్జనాభే త్వయి తటగతే సతి = మెత్తగా నూరిన కాటుక కాంతి గల నీవు ఆ కొండ చరియను సమీపించినప్పుడు
సద్యః కృత్తద్విరదదశనచ్ఛేదగౌరస్య తస్య అద్రేః = అప్పుడే ఖండించబడిన ఏనుగు దంతము వలె తెల్లగా ఉన్న కొండ యొక్క
శోభామ్ = సొగసును
హలభృతః = హలనును ధరించిన బలరాముడి యొక్క
అంసన్యస్తే మేచకే వాససి సతి = భుజములపై ఉంచిన నల్లని బట్టలో ఉన్న
(శోభామ్) ఇవ = అందమును వలె
స్తిమితనయనప్రేక్షణీయాం భవిత్రీమ్ = రెప్ప వేయని కన్నులతో చూడదగినదిగా కానున్న దానిని
ఉత్పశ్యామి = ఊహిస్తాను

తాత్పర్యమ్
మెత్తగా నూరిన కాటుక రంగులో ఉన్న నీవు, ఆ కొండ చరియను సమీపించినప్పుడు, అప్పుడే కోసిన ఏనుగు దంతము వలె తెల్లగా ఉన్న ఆ కొండ యొక్క సొగసునల్లని ఉత్తరీయాన్ని ధరించిన బలరాముడి సొగసు వలెరెప్పపాటు లేకుండా చూడదగ్గదిగా ఉంటుంది అని ఊహిస్తున్నాను.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...