ప్రాలేయాద్రేరుపతటమ్


శ్లోకః
ప్రాలేయాద్రేరుపతటమతిక్రమ్య తాంస్తాన్ విశేషాన్
హంసద్వారం భృగుపతియశోవర్త్మ యత్ క్రౌఞ్చరన్ధ్రమ్ ।
తేనోదీచీం దిశమనుసరేస్తిర్యగాయామశోభీ
శ్యామః పాదో బలినియమనాభ్యుద్యతస్యేవ విష్ణోః 1.60

పదవిభాగః
ప్రాలేయ-అద్రేః ఉపతటమ్ అతిక్రమ్య తాన్ తాన్ విశేషాన్ హంస-ద్వారం భృగు-పతి-యశః-వర్త్మ యత్ క్రౌఞ్చ-రన్ధ్రమ్ । తేన ఉదీచీం దిశమ్ అనుసరేః తిర్యక్ ఆయామ-శోభీ శ్యామః పాదః బలి-నియమన-అభ్యుద్యతస్య ఇవ విష్ణోః

అన్వయః
ప్రాలేయాద్రేః ఉపతటమ్ తాన్ తాన్ విశేషాన్ అతిక్రమ్య హంసద్వారం భృగుపతియశోవర్త్మ యత్ క్రౌఞ్చరన్ధ్రమ్ (వర్తతే) తేన బలినియమనాభ్యుద్యతస్య విష్ణోః శ్యామః పాదః ఇవ తిర్యగాయామశోభీ ఉదీచీం దిశమ్ అనుసరేః 1.60

ప్రతిపదార్థః
ప్రాలేయాద్రేః = మంచు కొండ యొక్క
ఉపతటమ్ = చరియను అనుసరిస్తూ
తాన్ తాన్ విశేషాన్ = ఆ యా విశేషాలను
అతిక్రమ్య = దాటుకొని
హంసద్వారం = హంసలు వెళ్ళే తోవ(గా)
భృగుపతియశోవర్త్మ = పరుశురాముడి కీర్తిపథము(గా)
యత్ క్రౌఞ్చరన్ధ్రమ్ (వర్తతే) = ఏ క్రౌంచపర్వతమార్గము ఉన్నదో
తేన = దాని గుండా
బలినియమనాభ్యుద్యతస్య విష్ణోః = బలిని అణగద్రొక్కేందుకుకు పైకెత్తిన విష్ణువు యొక్క
శ్యామః పాదః ఇవ = నల్లని పాదము వలె
తిర్యగాయామశోభీ = పొడవుగా సాగి
ఉదీచీం దిశమ్ = ఉత్తరదిశను
అనుసరేః = అనుసరించుము

తాత్పర్యమ్
ఆ మంచుకొండ చరియల వెంట కనబడే విశేషాలను చూస్తూ, హంసలు ఎగిరే మార్గమూ, పరుశురాముడి కీర్తిసూచకమూ అయిన క్రౌంచరంధ్రము గుండా బోరగిలి పొడవుగా బలిని పాతాళానికి అణగదొక్కేందుకు ఎత్తిన విష్ణుమూర్తి నల్లని పాదము వలెసాగి ఉత్తరము వైపుకు సాగిపొమ్ము.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...