గత్వా చోర్ధ్వం


శ్లోకః
గత్వా చోర్ధ్వం దశముఖభుజోచ్ఛ్వాసితప్రస్థసన్ధేః
కైలాసస్య త్రిదశవనితాదర్పణస్యాతిథిః స్యాః ।
శృఙ్గోచ్ఛ్రాయైః కుముదవిశదైర్యో వితత్య స్థితః ఖం
రాశీభూతః ప్రతిదినమివ త్ర్యమ్బకస్యాట్టహాసః 1.61

పదవిభాగః
గత్వా చ ఊర్ధ్వం దశముఖ-భుజ-ఉచ్ఛ్వాసిత-ప్రస్థసన్ధేః కైలాసస్య త్రిదశ-వనితా-దర్పణస్య అతిథిః స్యాః । శృఙ్గ-ఉచ్ఛ్రాయైః కుముద-విశదైః యః వితత్య స్థితః ఖం రాశీభూతః ప్రతిదినమ్ ఇవ త్ర్యమ్బకస్య అట్టహాసః

అన్వయః
ఊర్ధ్వం చ గత్వా దశముఖభుజోచ్ఛ్వాసితప్రస్థసన్ధేః త్రిదశవనితాదర్పణస్య కైలాసస్య అతిథిః స్యాః యః కుముదవిశదైః శృఙ్గోచ్ఛ్రాయైః ఖం వితత్య ప్రతిదినమ్ రాశీభూతః త్ర్యమ్బకస్య అట్టహాసః ఇవ స్థితః ॥1.61

ప్రతిపదార్థః
ఊర్ధ్వం చ గత్వా = ఇంకా పైకి వెళ్ళి
దశముఖభుజోచ్ఛ్వాసితప్రస్థసన్ధేః త్రిదశవనితాదర్పణస్య కైలాసస్య = రావణుడి భుజములచేత కొండకొమ్ముల సంధులు విడదీయబడ్డదీ, దేవతాస్త్రీల అద్దము వంటిదీ అయిన కైలాసపర్వతము యొక్క
అతిథిః స్యాః = అతిథివి కమ్ము
యః = ఎవడైతే (ఏదైతే)
కుముదవిశదైః శృఙ్గోచ్ఛ్రాయైః = కలువల తెలుపుతోనున్న ఎత్తైన శిఖరములతో
ఖం వితత్య = ఆకాశములో వ్యాపించి
ప్రతిదినమ్ = ప్రతి రోజూ
రాశీభూతః = గుట్టపడుతున్న
త్ర్యమ్బకస్య = మూడు కన్నులవాని
అట్టహాసః ఇవ = బిగ్గరగా నవ్విన నవ్వు వలె
స్థితః = ఉన్నాడో (ఉన్నదో)

తాత్పర్యమ్
ఇంకా పైకి వెళ్ళి, రావణుడి భుజముల చేత కీళ్ళు విడదీయబడ్డ కొండకొమ్ములను కలిగినదీ, దేవతాస్త్రీలకు అద్దము వలె అమరినదీ, కలువపూవుల తెలుపుతో ఎత్తుగా ఆకాశమందు వ్యాపించి ఉన్నదీ, పరమశివుడి అట్టహాసములు ప్రతిదినమూ గుట్ట పడిపోగా ఏర్పడినట్లున్నదీ అయిన కైలాసపర్వతమునకు అతిథివి కమ్ము.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...