యే సంరమ్భోత్పతనరభసాః


శ్లోకః
యే సంరమ్భోత్పతనరభసాః స్వాఙ్గభఙ్గాయ తస్మిన్
ముక్తాధ్వానం సపది శరభా లఙ్ఘయేయుర్భవన్తమ్ ।
తాన్ కుర్వీథాస్తుములకరకావృష్టిపాతావకీర్ణాన్
కే వా న స్యుః పరిభవపదం నిష్ఫలారమ్భయత్నాః 1.57

పదవిభాగః
యే సంరమ్భ-ఉత్పతన-రభసాః స్వ-అఙ్గ-భఙ్గాయ తస్మిన్ ముక్త-అధ్వానం సపది శరభాః లఙ్ఘయేయుః భవన్తమ్ । తాన్ కుర్వీథాః తుముల-కరకా-వృష్టి-పాత-అవకీర్ణాన్ కే వా న స్యుః పరిభవ-పదం నిష్ఫల-ఆరమ్భ-యత్నాః

అన్వయః
తస్మిన్ సంరమ్భోత్పతనరభసాః యే శరభాః ముక్తాధ్వానం భవన్తమ్ స్వాఙ్గభఙ్గాయ సపది లఙ్ఘయేయుః, తాన్ తుములకరకావృష్టిపాతావకీర్ణాన్ కుర్వీథాః, కే నిష్ఫలారమ్భయత్నాః పరిభవపదం న స్యుః వా 1.57

ప్రతిపదార్థః
తస్మిన్ = అక్కడ (ఆ కొండపై)
సంరమ్భోత్పతనరభసాః = రోషముతో పైకి దుముకుతున్నవి (అయిన)
యే శరభాః = ఏ శరభమృగములు
ముక్తాధ్వానం భవన్తమ్ = దారిని విడిచిన నిన్ను
స్వాఙ్గభఙ్గాయ = తమ శరీరాంగాలను విరగగొట్టుకునేందుకు
సపది = వెంటనే
లఙ్ఘయేయుః = దుముకుతాయో
తాన్ = వాటిని
తుములకరకావృష్టిపాతావకీర్ణాన్ = ఎడ్తెరపి లేని వడగళ్ళ వానతో చెల్లాచెరురైనవి (గా)
కుర్వీథాః = చేయుము
కే = ఎవరు
నిష్ఫలారమ్భయత్నాః = మొదలుపెట్టిన కార్యము నిష్ఫలమైనవారు
పరిభవపదం = అవమానమును (పొందినవారు)
న స్యుః = కారు

తాత్పర్యమ్
ఆ హిమాలయములలో, శరభమృగముల దారిని విడిచి ఉన్నప్పటికీ అవి (నీవు చాలా ఎత్తులో ఉన్నావన్న) రోషముతో ఆతురముగా నీ కన్నా పైకి ఎగురుతాయి. కాళ్ళూ, కీళ్ళూ విరగ్గొట్టుకోవడానికే ఆ ప్రయత్నము. ఎడతెరపిలేని వడగళ్ళవానతో వాటిని చెల్లాచెదురు చేయుము. మొదలుపెట్టిన పని పూర్తవకపోతే, అవమానము తప్పదు కదా ఎవరికైనా?”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...