శబ్దాయన్తే మధురమనిలైః
శ్లోకః
శబ్దాయన్తే మధురమనిలైః కీచకాః పూర్యమాణాః
సంసక్తాభిస్త్రిపురవిజయో గీయతే కిన్నరీభిః ।
నిర్హ్రాదస్తే మురజ ఇవ చేత్ కన్దరేషు ధ్వనిః స్యాత్
సంగీతార్థో నను పశుపతేస్తత్ర భావీ సమగ్రః ॥1.59॥
పదవిభాగః
శబ్దాయన్తే మధురమ్ అనిలైః కీచకాః పూర్యమాణాః సంసక్తాభిః త్రిపుర-విజయః గీయతే కిన్నరీభిః । నిర్హ్రాదః తే మురజ ఇవ చేత్ కన్దరేషు ధ్వనిః
స్యాత్ సంగీత-అర్థః నను పశుపతేః తత్ర భావీ సమగ్రః ॥
అన్వయః
తత్ర అనిలైః పూర్యమాణాః కీచకాః మధురమ్ శబ్దాయన్తే, సంసక్తాభిః కిన్నరీభిః త్రిపురవిజయః గీయతే కన్దరేషు తే నిర్హ్రాదః మురజ ఇవ
ధ్వనిః స్యాత్ చేత్ పశుపతేః సమగ్రః సంగీతార్థః భావీ నను ॥
ప్రతిపదార్థః
తత్ర = అక్కడ
అనిలైః = గాలులతో
పూర్యమాణాః కీచకాః = పూరింపబడిన వెదురు చెట్లు
మధురమ్ శబ్దాయన్తే = శ్రావ్యమైన శబ్దాలను చేస్తుంటాయి
సంసక్తాభిః కిన్నరీభిః = (దాని యందు) ఆసక్తి
కలిగిన కిన్నర స్త్రీల చేత
త్రిపురవిజయః = త్రిపురవిజయము
గీయతే = పాడబడుతుంది
కన్దరేషు = గుహలలో
తే = నీ యొక్క
నిర్హ్రాదః = ఉరుము చప్పుడు
మురజ ఇవ ధ్వనిః = మద్దెల వంటి చప్పుడువలె
స్యాత్ చేత్ = ఉన్నట్లయితే
పశుపతేః = శివుడికి
సంగీతార్థః = సంగీతపు సామగ్రి
సమగ్రః = సంపూర్ణము
భావీ నను = అవుతుంది కదా
తాత్పర్యమ్
“వెదుళ్ళలో నిండిన గాలి మధురమైన శబ్దాలను చేస్తూ ఉంటుంది.
వేణునాదముపై మక్కువ చూపే కిన్నెర స్త్రీలు మహాశివుడి త్రిపురవిజయమును
గురించి పాడుతూ ఉంటారు. ఆ కొండ గుహలలో ప్రతిధ్వనిస్తూ మద్దెల
చప్పుడు వలె నీ ఉరుము చప్పుడు జత అయినప్పుడు ఆ పశుపతికి వలసిన సంగీతపు సరంజామాలో వెలితి
తొలగిపోతుంది.”
Comments
Post a Comment