తత్ర వ్యక్తం దృషది


శ్లోకః
తత్ర వ్యక్తం దృషది చరణన్యాసమర్ధేన్దుమౌలేః
శశ్వత్ సిద్ధైరుపచితబలిం భక్తినమ్రః పరీయాః
యస్మిన్ దృష్టే కరణవిగమాదూర్ధ్వముద్ధూతపాపాః
కల్పిష్యన్తే స్థిరగణపదప్రాప్తయే శ్రద్దధానాః ॥1.58

పదవిభాగః
తత్ర వ్యక్తం దృషది చరణ-న్యాసమ్ అర్ధ-ఇన్దు-మౌలేః శశ్వత్ సిద్ధైః ఉపచిత-బలిం భక్తి-నమ్రః పరీయాః యస్మిన్ దృష్టే కరణ-విగమాత్ ఊర్ధ్వమ్ ఉద్ధూత-పాపాః కల్పిష్యన్తే స్థిర-గణ-పద-ప్రాప్తయే శ్రద్దధానాః ॥

అన్వయః
తత్ర దృషది వ్యక్తం శశ్వత్ సిద్ధైః ఉపచితబలిమ్ అర్ధేన్దుమౌలేః చరణన్యాసమ్ భక్తినమ్రః (సన్) పరీయాః యస్మిన్ దృష్టే కరణవిగమాత్ ఊర్ధ్వమ్ ఉద్ధూతపాపాః శ్రద్దధానాః స్థిరగణపదప్రాప్తయే కల్పిష్యన్తే ॥1.58॥

ప్రతిపదార్థః
తత్ర = అక్కడ
దృషది = రాతిపై
వ్యక్తం = ప్రకటితమైనది
శశ్వత్ = ఎల్లప్పుడు
సిద్ధైః = సిద్ధజాతి జనుల చేత
పచితబలిమ్ = పూజించబడేది
అర్ధేన్దుమౌలేః = నెలవంకను సిగన ముడిచిన వాడి యొక్క
చరణన్యాసమ్ = ఉంచబడిన పాదమును
భక్తినమ్రః (సన్) = భక్తితో వంగినవాడవై
పరీయాః = ప్రదక్షిణము చేయుము
యస్మిన్ దృష్టే = దేనిని చూడగానే
కరణవిగమాత్ ఊర్ధ్వమ్= శరీరమును విడిచిపెట్టిన తరువాత
ద్ధూతపాపాః శ్రద్దధానాః = పాపములు తొలగించబడిన శ్రద్ధాళువులు
స్థిరగణపదప్రాప్తయే = ప్రమథగణములలో స్థానము కొరకు
కల్పిష్యన్తే = అర్హులు అవుతారో

తాత్పర్యమ్
“ఆ హిమాలయాలలో ఒక శిలపై ప్రకటితమై ఉన్నదీ, సిద్ధజాతి ప్రజలచేత నిత్యము పూజించబడేది అయిన పరమశివుని పాదముద్ర చుట్టూ భక్తివినమ్రతలతో ప్రదక్షిణము చేయుము. ఆ పాదముద్రను చూసినంతనే, శ్రద్ధాళువులు పాపములు తొలగిపోయినవారై ప్రమథగణములలో స్థిరస్థానమును పొందేందుకు అర్హులవుతారు.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...