యత్ర స్త్రీణాం ప్రియతమభుజోచ్ఛ్వాసితాలిఙ్గితానామ్

శ్లోకః

యత్ర స్త్రీణాం ప్రియతమభుజోచ్ఛ్వాసితాలిఙ్గితానామ్
అఙ్గగ్లానిం సురతజనితాం తన్తుజాలావలమ్బాః ।
త్వత్సంరోధాపగమవిశదశ్చన్ద్రపాదైర్నిశీథే
వ్యాలుమ్పన్తి స్ఫుటజలలవస్యన్దినశ్చన్ద్రకాన్తాః 2.09

పదవిభాగః

యత్ర స్త్రీణాం ప్రియతమ-భుజ-ఉచ్ఛ్వాసిత-ఆలిఙ్గితానామ్ అఙ్గ-గ్లానిం సురత-జనితాం తన్తు-జాల-అవలమ్బాః । త్వత్ సంరోధ-అపగమ-విశదః-చన్ద్ర-పాదైః నిశీథే వ్యాలుమ్పన్తి స్ఫుట-జల-లవ-స్యన్దినః చన్ద్రకాన్తాః

అన్వయః

యత్ర నిశీథే త్వత్ సంరోధాపగమవిశదశ్చన్ద్రపాదైః స్ఫుటజలలవస్యన్దినః తన్తుజాలావలమ్బాః చన్ద్రకాన్తాః ప్రియతమభుజోచ్ఛ్వాసితాలిఙ్గితానామ్ స్త్రీణాం సురతజనితాం అఙ్గగ్లానిం వ్యాలుమ్పన్తి 2.09

ప్రతిపదార్థః

యత్ర = ఎక్కడ
నిశీథే = రాత్రి సమయములో
త్వత్ = నీయొక్క
సంరోధాపగమవిశదశ్చన్ద్రపాదైః = అడడ్డు తొలగిన తతెల్లని చంద్రుని పాదములతో (కిరణములతో)
స్ఫుటజలలవస్యన్దినః = నిర్మలములైన నీటి చుక్కలను స్ర్విస్తున్నవి
తన్తుజాలావలమ్బాః = దారముల నుంచి వేలాడుతున్నవి
చన్ద్రకాన్తాః = అయిన చంద్రకాంతమణులు
ప్రియతమభుజోచ్ఛ్వాసితాలిఙ్గితానామ్ స్త్రీణాం = సడలిన ప్రియుల భుజముల ఆలింగనమును కలిగిన స్త్రీల యొక్క
సురతజనితాం అఙ్గగ్లానిం = రతిశ్రమ వలన కలిగిన శరీరపు అలసటను
వ్యాలుమ్పన్తి = పోగొడతాయో

తాత్పర్యమ్

చంద్రుడికి నీ అడ్డు తొలగగా ప్రసరించిన తెల్లని కిరణాలు సోకి మంచపు పందిరులకు వ్రేలాడదీసిన చంద్రకాంతమణులు స్రవించిన జలబిందువులు, ప్రియుల కౌగిలి వదులైన ఆ సుందరుల రతి బడలికలను తొలగిస్తాయి.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

ప్రాప్యావన్తీనుదయనకథాకోవిదగ్రామవృద్ధాన్