నేత్రా నీతాః సతతగతినా

శ్లోకః


నేత్రా నీతాః సతతగతినా యద్విమానాగ్రభూమీ-
రాలేఖ్యానాం సలిలకణికాదోషముత్పాద్య సద్యః ।
శఙ్కాస్పృష్టా ఇవ జలముచస్త్వాదృశా జాలమార్గై-
ర్ధూమోద్గారానుకృతినిపుణా జర్జరా నిష్పతన్తి 2.08

పదవిభాగః

నేత్రా నీతాః సతత-గతినా యత్ విమాన-అగ్ర-భూమీః ఆలేఖ్యానాం సలిల-కణికా-దోషమ్ ఉత్పాద్య సద్యః । శఙ్కా-స్పృష్టాః ఇవ జలముచః త్వాదృశాః జాల-మార్గైః ధూమ-ఉద్గార-అనుకృతి-నిపుణాః జర్జరాః నిష్పతన్తి

అన్వయః

నేత్రా సతతగతినా యత్ విమానాగ్రభూమీః నీతాః త్వాదృశాః జలముచః ఆలేఖ్యానాం సలిలకణికాదోషమ్ ఉత్పాద్య సద్యః  శఙ్కాస్పృష్టాః ఇవ ధూమోద్గారానుకృతినిపుణాః జర్జరాః జాలమార్గైః నిష్పతన్తి 2.08

ప్రతిపదార్థః
నేత్రా సతతగతినా = దారిని చూపుతున్న గాలితో
యత్ విమానాగ్రభూమీః = ఏ సౌధాగ్రభాగాలకు
నీతాః = చేర్చబడినవారు (అయిన)
త్వాదృశాః జలముచః = నీ వంటి మేఘములు
ఆలేఖ్యానాం = చిత్తరువులకు
సలిలకణికాదోషమ్ = నీటి చుక్కల మరకను
ఉత్పాద్య = కలిగించి
సద్యః  = వెంటనే
శఙ్కాస్పృష్టాః ఇవ = శంక/భయము చేత తాకబడినవారి వలె
ధూమోద్గారానుకృతినిపుణాః = పొగ వెళ్ళడాన్ని అనుకరించడములో నిపుణులు (అయి)
జర్జరాః = చెదిరిపోయిన వారు (అయి)
జాలమార్గైః = గవాక్షరంధ్రముల నుంచి
నిష్పతన్తి = వెళ్ళిపోతారు

తాత్పర్యమ్

అక్కడి ఏడంతస్థుల మేడలపై భాగాలపైకి గాలి చేత తీసుకురాబడిన నీ వంటి మేఘాలు అక్కడ ఉన్న చిత్రాలపై నీటి చుక్కలను చిందించి వెంటనే తమ అపరాధమును గ్రహించి, చెదిరిపోయి పొగలాగా గవాక్షరంధ్రాల గుండా  బయటికి వెళ్ళిపోతాయి.”
(చెలికత్తెల చేత ప్రవేశపెట్టబడి, శృంగారానంతరము దొడ్డిదారిలో పారిపోయే జారులతో మేఘాన్ని పోల్చడం ఇందులో ధ్వని.)

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

ప్రాప్యావన్తీనుదయనకథాకోవిదగ్రామవృద్ధాన్