యత్రోన్మత్తభ్రమరముఖరాః
శ్లోకః
యత్రోన్మత్తభ్రమరముఖరాః పాదపా నిత్యపుష్పా
హంసశ్రేణీరచితరశనా నిత్యపద్మా నలిన్యః ।
కేకోత్కణ్ఠా భవనశిఖినో నిత్యభాస్వత్కలాపా
నిత్యజ్యోత్స్నాః ప్రతిహతతమోవృత్తిరమ్యాః ప్రదోషాః ॥2.03॥
పదవిభాగః
యత్ర ఉన్మత్త-భ్రమర-ముఖరాః పాదపాః
నిత్యపుష్పాః హంస-శ్రేణీ-రచిత-రశనా నిత్య-పద్మాః నలిన్యః । కేక-ఉత్కణ్ఠాః భవన-శిఖినః నిత్య-భాస్వత్-కలాపాః నిత్య-జ్యోత్స్నాః ప్రతిహత-తమః-వృత్తి-రమ్యాః ప్రదోషాః ॥
అన్వయః
యత్ర పాదపాః నిత్యపుష్పాః ఉన్మత్తభ్రమరముఖరాః, నలిన్యః నిత్యపద్మాః
హంసశ్రేణీరచితరశనాః, భవనశిఖినః నిత్యభాస్వత్కలాపాః కేకోత్కణ్ఠాః
ప్రదోషాః నిత్యజ్యోత్స్నాః ప్రతిహతతమోవృత్తిరమ్యాః ॥2.03॥
ప్రతిపదార్థః
యత్ర = ఎక్కడైతే
పాదపాః = వృక్షములు
నిత్యపుష్పాః = ఎల్లప్పుడూ పూలు పూస్తూ ఉంటాయో
ఉన్మత్తభ్రమరముఖరాః = మత్తిల్లిన తుమ్మెదల రొదలను కలిగి ఉంటాయో
నలిన్యః = తామర తూడులు
నిత్యపద్మాః = ఎప్పుడూ తామరలతో ఉంటాయో
హంసశ్రేణీరచితరశనాః = హంసల వరుసలతో చేసిన వడ్డాణాలను కలిగి ఉంటాయో
భవనశిఖినః = భవనములకు చెందిన నెమళ్ళు (పెంపుడు నెమళ్ళు)
నిత్యభాస్వత్కలాపాః = ఎప్పుడూ మెరుస్తూ ఉండే పింఛాలను కలిగి ఉంటాయో
కేకోత్కణ్ఠాః = మెడలను పైకెత్తిఅరుస్తూ ఉంటాయో
ప్రదోషాః = సాయంవేళలు
నిత్యజ్యోత్స్నాః = ఎల్లప్పుడూ వెన్నెలలతో ఉంటాయో
ప్రతిహతతమోవృత్తిరమ్యాః = చీకటిని పారద్రోలుతూ రమ్యంగా ఉంటాయో
తాత్పర్యమ్
“అలకాపురములోని వృక్షాలు అన్ని ఋతువులలో పుష్పిస్తాయి. ఆందుచేత, మత్తిల్లిన తుమ్మెదలు ఆటి దగ్గర చేరి ఎప్పుడూ
రొద పెడుతూ ఉంటాయి. అక్కడి తామర తూళ్ళపై పద్మాలు విరబూస్తూనే
ఉంటాయి. ఆ తామర తూళ్ళ చుట్టూ వడ్డాణము వలె హంసల బారులు ఉంటాయి.
అక్కడి ఇళ్ళలోని పెంపుడు నెమళ్ళు ధగధగలాడే పింఛాలతో తిరగాడుతూ,
మెడలను సాచి క్రేంకారాలు చేస్తూ ఉంటాయి. సాయంత్రమవగానే
వెన్నెలలు నిండి చీకటిని
పారద్రోలి మనస్సులకు హాయి గొలుపుతాయి.’
Comments
Post a Comment