ఆనన్దోత్థం నయనసలిలం


శ్లోకః
ఆనన్దోత్థం నయనసలిలం యత్ర నాన్యైర్నిమిత్తై-
ర్నాన్యస్తాపః కుసుమశరజాదిష్టసంయోగసాధ్యాత్ ।
నాప్యన్యస్మాత్ ప్రణయకలహాద్ విప్రయోగోపపత్తి-
ర్విత్తేశానాం న చ ఖలు వయో యౌవనాదన్యదస్తి 2.04

పదవిభాగః
ఆనన్ద-ఉత్థం నయన-సలిలం యత్ర న అన్యైః నిమిత్తైః న అన్యః తాపః కుసుమ-శరజాత్ ఇష్ట-సంయోగ-సాధ్యాత్ । న అపి అన్యస్మాత్ ప్రణయ-కలహాత్ విప్రయోగ-ఉపపత్తిః విత్త-ఈశానాం న చ ఖలు వయః యౌవనాత్ అన్యత్ అస్తి

అన్వయః
యత్ర విత్తేశానాం నయనసలిలం ఆనన్దోత్థం అన్యైః నిమిత్తైః న, ఇష్టసంయోగసాధ్యాత్ కుసుమశరజాత్ అన్యః తాపః న, ప్రణయకలహాత్ అన్యస్మాత్ విప్రయోగోపపత్తిః అపి న, యౌవనాత్ అన్యత్ వయః న అస్తి చ ఖలు 2.04

ప్రతిపదార్థః
యత్ర = ఎక్కడ
విత్తేశానాం = ధనపతులైన యక్షుల యొక్క
నయనసలిలం = కన్నీరు
ఆనన్దోత్థం = ఆనందము నుంచి పుట్టినది
అన్యైః నిమిత్తైః న = వేరు కారణాల వలన కాదు
ఇష్టసంయోగసాధ్యాత్ = ప్రియులను కూడి ఉండటం వలన తొలగిపోయేది
కుసుమశరజాత్ అన్యః= మన్మథునివలన కలిగేది కాక మరొక రకమైనది
తాపః న = వేడిమి లేదు
 ప్రణయకలహాత్ అన్యస్మాత్ = ప్రణయకలహము తక్క మరొక కారణము వలన
విప్రయోగోపపత్తిః అపి న = వియోగము ప్రాప్తించడము లేదు
యౌవనాత్ అన్యత్ = యౌవనము కాక
వయః = వయస్సు
న అస్తి చ ఖలు = లేదు కదా

తాత్పర్యమ్
ఆ అలకానగరములోని యక్షుల కంట ఆనందబాష్పాలే కానీ ఇతరకారణాల వలన కన్నీరు ఒలకదు. ప్రియసమాగమముతో పోగొట్టుకోగలిగే మన్మథతాపమే కానీ మరొక వేడిమి వారెరుగరు. ప్రణయకలహము వినా వేరే కారణాల వలన ఎడబాటు కలగదు. నిత్యయౌవనమే తప్ప మరొక అవస్థ లేదు వారికి.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...