విద్యుద్వన్తం లలితవనితాః
శ్లోకః
విద్యుద్వన్తం లలితవనితాః సేన్ద్రచాపం సచిత్రాః
సఙ్గీతాయ ప్రహతమురజాః స్నిగ్ధగమ్భీరఘోషమ్ ।
అన్తస్తోయం మణిమయభువస్తుఙ్గమభ్రంలిహాగ్రాః
ప్రాసాదాస్త్వాం తులయితుమలం యత్ర తైస్తైర్విశేషైః ॥2.01॥
పదవిభాగః
విద్యుద్వన్తం లలిత-వనితాః స-ఇన్ద్ర-చాపం సచిత్రాః సఙ్గీతాయ ప్రహత-మురజాః స్నిగ్ధ-గమ్భీర-ఘోషమ్ । అతః తోయం మణిమయ-భువః తుఙ్గమ్ అభ్రంలిహ-అగ్రాః ప్రాసాదాః త్వాం
తులయితుమ్ అలం యత్ర తైః తైః విశేషైః ॥
అన్వయః
యత్ర లలితవనితాః సచిత్రాః సఙ్గీతాయ ప్రహతమురజాః మణిమయభువః అభ్రంలిహాగ్రాః ప్రాసాదాః
సేన్ద్రచాపం స్నిగ్ధగమ్భీరఘోషమ్ విద్యుద్వన్తం తుఙ్గమ్ అన్తస్తోయం త్వాం తైః తైః విశేషైః
తులయితుమ్ అలమ్ ॥ 2.01॥
ప్రతిపదార్థః
యత్ర = ఎక్కడైతే
లలితవనితాః = అందమైన స్త్రీలు కలవి
సచిత్రాః = చిత్తరువులు కలిగినవి
సఙ్గీతాయ = సంగీతము కొరకు
ప్రహతమురజాః = కొట్టబడిన మద్దెలలు కలవి
మణిమయభువః = మణిమయమైన (పాన,
వినోద) భూములు కలవి
అభ్రంలిహాగ్రాః = ఆకాశమునంటి ఉండే ఉపరిభాగములు కలవి (అయిన)
ప్రాసాదాః = భవనములు
సేన్ద్రచాపం = ఇంద్రచాపముతోనున్నవాడిని
స్నిగ్ధగమ్భీరఘోషమ్ = శ్రావ్యగంభీరమైన ధ్వనిని చేసేవాడిని
విద్యుద్వన్తం = మెరుపు ఉన్నవాడిని
తుఙ్గమ్ = ఎత్తైనవాడిని
అన్తస్తోయం = లోపల నీటిని కలిగి ఉన్నవాడిని
త్వాం = నిన్ను
తైః తైః విశేషైః = ఆ యా విశేషాలతో
తులయితుమ్ = పోల్చుటకు
అలమ్ = చాలును (తగి ఉన్నది)
తాత్పర్యమ్
“నీ దగ్గర ఇంద్రధనుస్సు ఉంటుంది. అక్కడి భవనాలలోని
రంగుల చిత్తరువులు. నీవు మెరుపుతో కూడి ఉంటావు. ఆ భవనాలలో సౌందర్యవతులు ఉంటారు. నీవు శ్రావ్యముగా గంభీరముగా
గర్జనధ్వనిని చేస్తావు. అక్కడ సంగీతార్థము మ్రోగించబడుతున్న మద్దెలల
చప్పుడు ఉంటుంది. నీవు ఉన్నతుడివి. ఆ సౌధాగ్రాలు
ఆకాశాన్ని అంటి ఉంటాయి. నీలో నీటి నిలువలు ఉంటాయి. వాటిల్లో మణిమయభూములు ఉంటాయి. ఆ యా విశేషాలతో నీతో ఉపమించదగ్గవిగా
ఉంటాయి అలకాపురి సౌధాలు.”
Comments
Post a Comment