హేమామ్భోజప్రసవి సలిలం


శ్లోకః
హేమామ్భోజప్రసవి సలిలం మానసస్యాదదానః
కుర్వన్ కామం క్షణముఖపటప్రీతిమైరావతస్య ।
ధున్వన్ కల్పద్రుమకిసలయాన్యంశుకానీవ వాతై-
ర్నానాచేష్టైర్జలదలలితైర్నిర్విశేస్తం నగేన్ద్రమ్ 1.65

పదవిభాగః
హేమ-అమ్భోజ-ప్రసవి సలిలం మానసస్య-ఆదదానః కుర్వన్ కామం క్షణ-ముఖ-పట-ప్రీతిమ్ ఐరావతస్య । ధున్వన్ కల్ప-ద్రుమ-కిసలయాని అంశుకాని ఇవ వాతైః నానా-చేష్టైః జలద లలితైః నిర్విశేః తం నగ-ఇన్ద్రమ్

అన్వయః
జలద, హేమామ్భోజప్రసవి మానసస్య సలిలం ఆదదానః ఐరావతస్య క్షణముఖపటప్రీతి కుర్వన్  వాతైః కల్పద్రుమకిసలయాని అంశుకానీవ ధున్వన్ తం నగేన్ద్రమ్ లలితైః నానాచేష్టైః కామం నిర్విశేః 1.65

ప్రతిపదార్థః
జలద = ఓ మేఘుడా
హేమామ్భోజప్రసవి = స్వర్ణకమలములను ప్రసవించు
మానసస్య = మానససరోవరము యొక్క
సలిలం = నీటిని
ఆదదానః = గ్రహించినవాడవై
ఐరావతస్య = ఐరావతము యొక్క
క్షణముఖపటప్రీతి కుర్వన్  = క్షణము పాటు ముఖముపై  ముసుగు వేసి ప్రీతిని గూర్చి
వాతైః = గాలులతో
కల్పద్రుమకిసలయాని = కల్పవృక్షపు చిగురుటాకులను
అంశుకానీవ = సన్నని బట్టను వలె
ధున్వన్ = కదిలిస్తూ
తం నగేన్ద్రమ్ = ఆ పర్వతరాజును
లలితైః నానాచేష్టైః = సున్నితమైన వివిధచేష్టలతో
కామం నిర్విశేః = యథేచ్ఛగా అనుభవింపుము

తాత్పర్యమ్
బంగారు తామరపూలు జన్మించే మానససరోవరము యొక్క నీటిని తాగుము. (నీరు త్రాగేందుకు అక్కడికి వచ్చిన) ఐరావతపు ముఖముపై ముసుగు వలె కమ్మి దానికి ప్రీతిని కలిగించుము. కల్పవృక్షపు చిగురుటాకులను సన్నని వస్త్రమును కదిలించినట్లు కదిలించుము. ఈ విధముగా సున్నితమైన నీ చేష్టలతో ఆ కైలాసపర్వతమున యథేచ్ఛగా వినోదింపుము.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...