తత్రావశ్యం
శ్లోకః
తత్రావశ్యం వలయకులిశోద్ఘట్టనోద్గీర్ణతోయం
నేష్యన్తి త్వాం సురయువతయో యన్త్రధారాగృహత్వమ్ ।
తాభ్యో మోక్షస్తవ యది సఖే ఘర్మలబ్ధస్య న స్యాత్
క్రీడాలోలాః శ్రవణపరుషైర్గర్జితైర్భాయయేస్తాః ॥1.64॥
పదవిభాగః
తత్ర అవశ్యం వలయ-కులిశ-ఉద్ఘట్టన-ఉద్గీర్ణ-తోయం నేష్యన్తి త్వాం సుర-యువతయః యన్త్ర-ధారా-గృహత్వమ్ ।
తాభ్యః మోక్షః తవ యది సఖే ఘర్మ-లబ్ధస్య న స్యాత్ క్రీడా-లోలాః శ్రవణ-పరుషైః గర్జితైః భాయయేః తా ॥
అన్వయః
తత్ర సురయువతయః అవశ్యం వలయకులిశోద్ఘట్టనోద్గీర్ణతోయం త్వాం యన్త్రధారాగృహత్వమ్
నేష్యన్తి, సఖే! తాభ్యః ఘర్మలబ్ధస్య తవ మోక్షః న
స్యాత్ యది శ్రవణపరుషైః గర్జితైః క్రీడాలోలాః తాః భాయయేః ॥1.64॥
ప్రతిపదార్థః
తత్ర = అక్కడ
సురయువతయః = దేవతాస్త్రీలు
అవశ్యం = తప్పక
వలయకులిశోద్ఘట్టనోద్గీర్ణతోయం త్వాం = కంకణాలలోని గట్టి భాగాలతో
కొట్టబడి నీటిని చిమ్మే నిన్ను (నీకు)
యన్త్రధారాగృహత్వమ్ = కృత్రిమజలధారలను కురిపించే ఇంటి స్వభావాన్ని
నేష్యన్తి = కలిగిస్తారు
సఖే = మిత్రమా
తాభ్యః = వారి నుంచి
ఘర్మలబ్ధస్య తవ = వేసవి తాపము నుంచి
మోక్షః న స్యాత్ యది = విడుదల లభించక పోతే
శ్రవణపరుషైః గర్జితైః = కర్ణకఠోరమైన ఉరుములతో
క్రీడాలోలాః తాః = ఆటలయందు ఆసక్తి కలిగిన వారిని
భాయయేః = భయపెట్టుము
తాత్పర్యమ్
“ఆ కైలాసములో దేవతాస్త్రీలు తమ చేతి కడియాలలోని గట్టి భాగాలతో కొట్టి,
నిన్ను జలధారలను చిమ్మే ఒక కృత్రిమజలధారాగృహముగా మార్చివేస్తారు.
గ్రీష్మతాపమును పోగొట్టే నిన్ను వారు వదిలిపెట్టకపోతే, కర్ణకఠోరమైన నీ ఉరుములను వినిపించి ఆ క్రీడాసక్తయువతులను భయపెట్టుము.”
Comments
Post a Comment