ఆరాధ్యైనం శరవణభవం
శ్లోకః
ఆరాధ్యైనం శరవణభవం దేవముల్లఙ్ఘితాధ్వా
సిద్ధద్వన్ద్వైర్జలకణభయాద్ వీణిభిర్ముక్తమార్గః ।
వ్యాలమ్బేథాః సురభితనయాలమ్భజాం మానయిష్యన్
స్రోతోమూర్త్యా భువి పరిణతాం రన్తిదేవస్య కీర్తిమ్ ॥1.48॥
పదవిభాగః
ఆరాధ్య ఏనం శరవణ-భవం దేవమ్ ఉల్లఙ్ఘిత-అధ్వా సిద్ధ-ద్వన్ద్వైః
జల-కణ-భయాత్ వీణిభిః ముక్త-మార్గః । వ్యాలమ్బేథాః
సురభి-తనయా-ఆలమ్భజాం మానయిష్యన్ స్రోతః-మూర్త్యా భువి పరిణతాం రన్తిదేవస్య కీర్తిమ్ ॥
అన్వయః
ఏనం శరవణభవం దేవమ్ ఆరాధ్య జలకణభయాత్ వీణిభిః సిద్ధద్వన్ద్వైః
ముక్తమార్గః (సన్) ఉల్లఙ్ఘితాధ్వా సురభితనయాలమ్భజాం స్రోతోమూర్త్యా భువి పరిణతాం
రన్తిదేవస్య కీర్తిమ్ మానయిష్యన్ వ్యాలమ్బేథాః ॥1.48॥
ప్రతిపదార్థః
ఏనం శరవణభవం దేవమ్ = ఈవిధమైన రెల్లుగడ్డి వనములో పుట్టిన
కుమారస్వామిని
ఆరాధ్య = ఆరాధించి
వీణిభిః సిద్ధద్వన్ద్వైః = వీణలను ధరించిన సిద్ధదంపతులచేత
జలకణభయాత్ = నీటి బిందువుల భయముతో
ముక్తమార్గః (సన్) = తోవ విడవబడినవాడవై
ఉల్లఙ్ఘితాధ్వా = మార్గము దాటినవాడవై
సురభితనయాలమ్భజాం = గోవులను యాగములో బలి ఇవ్వడం వలన జన్మించిన దానిని
భువి = భూమిలో
స్రోతోమూర్త్యా పరిణతాం = నదిగా రూపొందినదానిని
రన్తిదేవస్య కీర్తిమ్ = రంతిదేవుని కీర్తిని
మానయిష్యన్ = గౌరవిస్తూ
వ్యాలమ్బేథాః = కిందికి దిగుము
తాత్పర్యమ్
“శరవణభవుడైన కుమారస్వామిని ఆరాధించిన తరువాత, వీణాధారులైన సిద్ధదంపతులు జలబిందువుల
భయముతో (నీటి చుక్కలు తీగలపై పడితే వీణానాదము సరిగా వినబడదని) తోవ నుంచి పక్కకి తొలగిపోగా,
ఆ మార్గాన్ని దాటి, యజ్ఞములలో బలి ఈయబడిన ఆవుల చర్మరాశినుంచి జన్మించినది, రంతిదేవుడి
కీర్తికి నదీరూపమై ఈ భూమి మీద ప్రవహిస్తున్నదీ అయిన చర్మణ్వతీనదిని గౌరవిస్తూ క్రిందికి
దిగుము.”
Comments
Post a Comment