జ్యోతిర్లేఖావలయి గలితం


శ్లోకః
జ్యోతిర్లేఖావలయి గలితం యస్య బర్హం భవానీ
పుత్రప్రేమ్ణా కువలయదలప్రాపి కర్ణే కరోతి
ధౌతాపాఙ్గం హరశశిరుచా పావకేస్తం మయూరం
పశ్చాదద్రిగ్రహణగురుభిర్గర్జితైర్నర్తయేథాః ॥1.47

పదవిభాగః
జ్యోతిః-లేఖా-వలయి గలితం యస్య బర్హం భవానీ పుత్ర-ప్రేమ్ణా కువలయ-దల-ప్రాపి కర్ణే కరోతి ధౌత-అపాఙ్గం హర-శశి-రుచా పావకేః తం మయూరం పశ్చాత్ అద్రి-గ్రహణ-గురుభిః గర్జితైః నర్తయేథాః

అన్వయః
పశ్చాత్, యస్య గలితం జ్యోతిర్లేఖావలయి బర్హం భవానీ పుత్రప్రేమ్ణా కువలయదలప్రాపి కర్ణే కరోతి పావకేః తం హరశశిరుచా ధౌతాపాఙ్గం మయూరం ద్రిగ్రహణగురుభిః గర్జితైః నర్తయేథాః ॥1.47

ప్రతిపదార్థః
పశ్చాత్ = తరువాత
యస్య = దేనియొక్క
గలితం = జారిన
జ్యోతిర్లేఖావలయి బర్హం = కాంతిరేఖల వలయాలతో నున్న నెమలీకను
భవానీ = పార్వతి
పుత్రప్రేమ్ణా = కుమారుడిపైనున్న ప్రేమతో
కువలయదలప్రాపి కర్ణే = కలువరేకులకు అర్హమైన చెవిలో
కరోతి = పెట్టుకుంటుందో
పావకేః = పావకి (కుమారస్వామి యొక్క)
తం హరశశిరుచా ధౌతాపాఙ్గం మయూరం = శివుని తలనున్న చంద్రుని కాంతితో తెల్లనైన కడకన్నులుగల ఆ నెమలిని
ద్రిగ్రహణగురుభిః గర్జితైః = కొండ గుహల (నుంచి వచ్చే ప్రతిధ్వనుల) చేత అతిశయించిన ఉరుములతో
ర్తయేథాః = నర్తింపజేయుము

తాత్పర్యమ్
“(పుష్పసేచనము) తరువాత – ఆ కొండ గుహలలో ప్రతిధ్వనించడం వల్ల మరింత బిగ్గరగా వినబడే గర్జనలను చేస్తూ ఆ స్కందుడి నెమలిని నాట్యము చేయించుము. హరజటాజూటచంద్రుని కాంతితో ఇంకా తెల్లబడిన కడకన్నులు గలది ఆ నెమలి. కొడుకుపై ప్రేమతో పార్వతీదేవి - కలువరేకులతో అలంకరించదగ్గ - తన చెవిలో ఆ నెమలి నుంచి జారిన వెలుగుల ఈకను పెట్టుకుంటుంది.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...