తత్ర స్కన్దం నియతవసతిం
శ్లోకః
తత్ర స్కన్దం నియతవసతిం పుష్పమేఘీకృతాత్మా
పుష్పాసారైః స్నపయతు భవాన్ వ్యోమగఙ్గాజలార్ద్ ।
రక్షాహేతోర్నవశశిభృతా వాసవీనాం చమూనామ్
అత్యాదిత్యం హుతవహముఖే సంభృతం తద్ధి తేజః ॥1.46॥
పదవిభాగః
తత్ర స్కన్దం నియత-వసతిం పుష్ప-మేఘీకృత-ఆత్మా పుష్ప-ఆసారైః స్నపయతు భవాన్ వ్యోమ-గఙ్గా-జల-ఆర్ద్రైః । రక్షా-హేతోః-నవ-శశిభృతా
వాసవీనాం చమూనామ్ అతి-ఆదిత్యం హుతవహ-ముఖే
సంభృతం తత్ హి తేజః ॥
అన్వయః
భవాన్ పుష్పమేఘీకృతాత్మా (సన్) తత్ర
నియతవసతిం స్కన్దం వ్యోమగఙ్గాజలార్ద్రైః పుష్పాసారైః స్నపయతు, తత్ వాసవీనాం చమూనామ్ రక్షాహేతోః నవశశిభృతా హుతవహముఖే సంభృతం అత్యాదిత్యం
తేజః హి ॥1.46॥
ప్రతిపదార్థః
భవాన్ = నీవు
పుష్పమేఘీకృతాత్మా (సన్) = పుష్పమేఘమువై
తత్ర = అక్కడ (దేవగిరిలో)
నియతవసతిం స్కన్దం = స్థిరనివాసము గల కుమారస్వామిని
వ్యోమగఙ్గాజలార్ద్రైః = ఆకాశగంగలోని నీటితో తడిసిన
పుష్పాసారైః = పూలవానతో
స్నపయతు = స్నానము చేయించుము
తత్ = అతడు
వాసవీనాం చమూనామ్ = ఇంద్రుడి సేనల యొక్క
రక్షాహేతోః = రక్షణ కోసము
నవశశిభృతా = నెలవంకను దాల్చిన శివుడి చేత
హుతవహముఖే = అగ్ని ముఖమున
సంభృతం = ఉంచబడిన
అత్యాదిత్యం తేజః హి = సూర్యుడి కన్నా అధికమైన తేజము కదా
తాత్పర్యమ్
“నీవు పూలవాన కురిపించగల మబ్బుగా మారి అక్కడ దేవగిరిలో స్థిరనివాసమునేర్పరచుకొని
యున్న కుమారస్వామిపై ఆకాశగంగాజలములలో తడిసిన పూలవానను కురిపించుము. సూర్యుడిని మించిన తేజస్సు ఆయనది. ఇంద్రుడి సేనల సంరక్షణార్థము
అగ్ని చేత మోయబడిన శివతేజము కదా అది!”
Comments
Post a Comment