తస్యాః పాతుం సురగజ ఇవ
శ్లోకః
తస్యాః పాతుం సురగజ ఇవ వ్యోమ్ని పశ్చార్ధలమ్బీ
త్వం చేదచ్ఛస్ఫటికవిశదం తర్కయేస్తిర్యగమ్భః ।
సంసర్పన్త్యా సపది భవతః స్రోతసి చ్ఛాయయాసౌ
స్యాదస్థానోపగతయమునాసఙ్గమేవాభిరామా ॥1.54॥
పదవిభాగః
తస్యాః పాతుం సుర-గజః ఇవ వ్యోమ్ని పశ్చ-అర్ధ-లమ్బీ త్వం చేత్ అచ్ఛ-స్ఫటిక-విశదం
తర్కయేః తిర్యక్ అమ్భః । సంసర్పన్త్యా
సపది భవతః స్రోతసి ఛాయయా అసౌ స్యాత్ అస్థాన-ఉపగత-యమునా-సఙ్గమ ఇవ అభిరామా ॥
అన్వయః
సురగజః ఇవ త్వం వ్యోమ్ని పశ్చార్ధలమ్బీ (సన్) తస్యాః అచ్ఛస్ఫటికవిశదం అమ్భః తిర్యక్
పాతుం తర్కయేః చేత్ సపది స్రోతసి సంసర్పన్త్యా భవతః ఛాయయా అసౌ అస్థానోపగత-యమునా-సఙ్గమా ఇవ అభిరామా స్యాత్
॥1.54॥
ప్రతిపదార్థః
సురగజః ఇవ త్వం = దిగ్గజము వంటి నీవు
వ్యోమ్ని = ఆకాశములో
పశ్చార్ధలమ్బీ (సన్) = వెనకభాగముతో వ్రేలాడుతున్నవాడవై
తస్యాః = ఆమె (గంగానది) యొక్క
అచ్ఛస్ఫటికవిశదం అమ్భః = స్పష్టమైన
స్ఫటికము వలె తెల్లనిదైన నీటిని
తిర్యక్ = తలక్రిందులుగా
పాతుం = తాగుటకు
తర్కయేః చేత్ = తలపెడితే
సపది = ఆ క్షణాన
స్రోతసి = నదిలో
సంసర్పన్త్యా భవతః ఛాయయా = పాకుతున్న నీ నీడతో
అసౌ = ఆమె (గంగ)
అస్థానోపగత-యమునా-సఙ్గమా ఇవ = వేరొకచోట యమునానదితో సంగమించిన దానివలె
అభిరామా = మనోహరముగా
స్యాత్ = ఉంటుంది
తాత్పర్యమ్
“నేలవైపు తొండాన్ని చాపి ఆకాశం నుంచి వ్రేలాడే ఏనుగులాగా ఆ గంగానదిలోని స్ఫటికనిర్మలమైన
నీటిని తాగేందుకు తలక్రిందులై నీవు నిలిచినప్పుడు, పాకుతున్న నీ నీడతో ఆ నది, ప్రయాగ
కన్నా ముందే యమునానదితో కలిసినట్లు చూడ ముచ్చటగా ఉంటుంది.”
Comments
Post a Comment