తం చేద్ వాయౌ సరతి...


శ్లోకః
తం చేద్ వాయౌ సరతి సరలస్కన్ధసఙ్ఘట్టజన్మా
బాధేతోల్కాక్షపితచమరీవాలభారో దవాగ్నిః ।
అర్హస్యేనం శమయితుమలం వారిధారాసహస్రై-
రాపన్నార్తిప్రశమనఫలాః సంపదో హ్యుత్తమానామ్ 1.56

పదవిభాగః
తం చేత్ వాయౌ సరతి సరల-స్కన్ధ-సఙ్ఘట్ట-జన్మా బాధేత ఉల్కా-క్షపిత-చమరీ-వాల-భారః దవా-అగ్నిః ।
అర్హసి ఏనం శమయితుమ్ అలం వారి-ధారా-సహస్రైః ఆపన్న-ఆర్తి-ప్రశమన-ఫలాః సంపదః హి ఉత్తమానామ్

అన్వయః
వాయౌ సరతి (సతి) సరలస్కన్ధసఙ్ఘట్టజన్మా ఉల్కాక్షపితచమరీవాలభారః దవాగ్నిః తం బాధేత చేత్ ఏనం వారిధారాసహస్రైః అలం శమయితుమ్ అర్హసి, ఉత్తమానామ్ సంపదః ఆపన్నార్తిప్రశమనఫలాః హి 1.56

ప్రతిపదార్థః
వాయౌ సరతి (సతి) = గాలి వీస్తూ ఉండగా
సరలస్కన్ధసఙ్ఘట్టజన్మా = దేవదారువృక్షముల కాండముల రాపిడి నుంచి పుట్టినది
ఉల్కాక్షపితచమరీవాలభారః = నిప్పు రవ్వలతో చమరీమృగముల తోకలను కాల్చునది అయిన
దవాగ్నిః = అడవిలో పుట్టే మంట
తం = అతడిని (ఆ కొండను)
బాధేత చేత్ = బాధించినట్లైతే
ఏనం = ఇతడిని (దానిని)
వారిధారాసహస్రైః = వేల కొలది జలధారలతో
అలం శమయితుమ్ = పూర్తిగా చల్లార్చుటకు
అర్హసి = తగుదువు
ఉత్తమానామ్ సంపదః = ఉత్తముల సంపదలు
ఆపన్నార్తిప్రశమనఫలాః హి = ఆపన్నుల బాధను ఉపశమించుటయే ఫలముగా ఉన్నవి కదా

తాత్పర్యమ్
ఆ కొండపై వీచే గాలుల కారణంగా రాపిడికి లోనైన దేవదారు తరువుల బోదెల నుండి పుట్టినదీ, నిప్పురవ్వలతో చమరీ మృగాలను కాల్చివేసేదీ అయిన కార్చిచ్చు ఆ కొండను బాధిస్తూ ఉంటే నీటి ధారలను వేలకొలదిగా వర్షించి దానిని చల్లార్చుము. ఆపదలలో ఉన్నవారి కష్టాన్ని తగ్గించడమే కదా ఉత్తముల సంపదకు పరమార్థము.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ