ఆసీనానాం సురభితశిలం...
శ్లోకః
ఆసీనానాం సురభితశిలం నాభిగన్ధైర్మృగాణాం
తస్యా ఏవ ప్రభవమచలం ప్రాప్య గౌరం తుషారైః ।
వక్ష్యస్యధ్వశ్రమవినయనే తస్య శృఙ్గే నిషణ్ణః
శోభాం శుభ్రత్రినయనవృషోత్ఖాతపఙ్కోపమేయామ్ ॥1.55॥
పదవిభాగః
ఆసీనానాం సురభిత-శిలం నాభి-గన్ధైః
మృగాణాం తస్యాః ఏవ ప్రభవమ్ అచలం ప్రాప్య గౌరం తుషారైః । వక్ష్యసి అధ్వ-శ్రమ-వినయనే తస్య శృఙ్గే నిషణ్ణః శోభాం శుభ్ర-త్రి-నయన-వృష-ఉత్ఖాత-పఙ్క-ఉపమేయామ్ ॥
అన్వయః
ఆసీనానాం మృగాణాం నాభిగన్ధైః సురభితశిలం
తుషారైః తస్యాః ఏవ ప్రభవమ్ గౌరం అచలం ప్రాప్య తస్య అధ్వశ్రమవినయనే శృఙ్గే నిషణ్ణః (సన్)
శుభ్రత్రినయనవృషోత్ఖాతపఙ్కోపమేయామ్ శోభాం వక్ష్యసి ॥1.55॥
ప్రతిపదార్థః
ఆసీనానాం మృగాణాం = కూర్చొని ఉన్న కస్తూరిమృగముల
యొక్క
నాభిగన్ధైః = బొడ్డులోని పరిమళములతో
సురభితశిలం = గుబాళిస్తున్న శిలలను కలిగినది
తుషారైః గౌరం = మంచు చినుకులతో తెల్లబడినది
తస్యాః ఏవ ప్రభవమ్ = ఆమెకే (గంగానదికే) జన్మస్థలమైనది (అయిన)
అచలం = పర్వతమును
ప్రాప్య = చేరి
తస్య = అతడి యొక్క (దాని యొక్క)
అధ్వశ్రమవినయనే శృఙ్గే = మార్గాయాసమును తీర్చగల శిఖరముపై
నిషణ్ణః (సన్) = కూర్చున్నవాడివై
శుభ్ర-త్రినయన-వృషోత్ఖాత-పఙ్కోపమేయామ్ = శివుని యొక్క
తెల్లని ఎద్దు చేత పైకి లేపబడిన బురదతో పోల్చదగినది (అయిన)
శోభాం = శోభను
వక్ష్యసి = ధరించనున్నావు
తాత్పర్యమ్
“బొడ్డున పరిమళము ఉండే కస్తూరిమృగములు కూర్చొని ఉండడం చేత సువాసన గొలిపే బండరాళ్ళను
కలిగి ఉన్నదీ, మంచు తుంపరలతో తెలుపెక్కి ఉన్నదీ, ఆ గంగానదికే ఉద్భవస్థానమైనదీ అయిన
హిమాలయాలను చేరి, దారి బడలికను తీర్చుకునేందుకు ఆ శిఖరముపై నీవు కూర్చొని ఉన్నప్పుడు,
నందీశ్వరుడు తన గిట్టలతో కొమ్ములతో రేపిన బురదకున్నటువంటి సొగసును సంతరించుకుంటావు.”
Comments
Post a Comment