తస్మాద్ గచ్ఛేరనుకనఖలం
శ్లోకః
తస్మాద్ గచ్ఛేరనుకనఖలం శైలరాజావతీర్ణాం
జహ్నోః కన్యాం సగరతనయస్వర్గసోపానపఙ్క్తిమ్ ।
గౌరీవక్త్రభ్రుకుటిరచనాం యా విహస్యేవ ఫేనైః
శమ్భోః కేశగ్రహణమకరోదిన్దులగ్నోర్మిహస్తా ॥1.53॥
పదవిభాగః
తస్మాత్ గచ్ఛేః అను కనఖలం శైల-రాజ-అవతీర్ణాం జహ్నోః కన్యాం సగర-తనయ-స్వర్గ-సోపాన-పఙ్క్తిమ్ । గౌరీ-వక్త్ర-భ్రుకుటి-రచనాం యా
విహస్య ఇవ ఫేనైః శమ్భోః కేశ-గ్రహణమ్ అకరోత్ ఇన్దు-లగ్న-ఊర్మి-హస్తా ॥
అన్వయః
తస్మాత్ అను కనఖలం శైలరాజఅవతీర్ణాం సగరతనయస్వర్గసోపానపఙ్క్తిమ్ గౌరీవక్త్రభ్రుకుటిరచనాం
జహ్నోః కన్యాం గచ్ఛేః యా ఇన్దులగ్నోర్మిహస్తా ఫేనైః విహస్య ఇవ శమ్భోః కేశగ్రహణమ్ అకరోత్
॥1.53॥
ప్రతిపదార్థః
తస్మాత్ = అక్కడి నుంచి
అను కనఖలం = కనఖలము అనే తీర్థమును అనుసరించిన దానిని
శైలరాజఅవతీర్ణాం = పర్వతరాజైన హిమాలయము నుంచి అవతరించిన దానినిన్
సగరతనయస్వర్గసోపానపఙ్క్తిమ్ = సగరుడి కుమారుల స్వర్గారోహణమునకు మెట్లవరుసగా
నిలచినదానిని
జహ్నోః కన్యాం = జహ్నుమహర్షి కూతురును
గచ్ఛేః = చేరుకొనుము
యా = ఎవరైతే
ఫేనైః = నురగలతో
గౌరీవక్త్రభ్రుకుటిరచనాం = పార్వతి ముఖపు ముడులను
విహస్య ఇవ = నవ్వుతున్నట్లు
ఇన్దులగ్నోర్మిహస్తా = చంద్రుడిని అలల చేతులతో అంటి ఉంటుందో
శమ్భోః కేశగ్రహణమ్ అకరోత్ = శివుడి జుట్టును పట్టుకొన్నదో
తాత్పర్యమ్
“కురుక్షేత్రము నుంచి బయలుదేరి, - కనఖలతీర్థముననుసరించి
పారునదీ, పర్వతరాజైన హిమాలయము నుంచి దిగి వచ్చినదీ, జహ్ను పుత్రికయైనదీ, సగరపుత్రుల స్వర్గారోహణకు సాధనమైనదీ
అయిన - గంగా నదిని సమీపించుము. తన నురగల
నవ్వులతో పార్వతీదేవి ముఖపు చిటపటలను గేలి చేస్తూ, తన తరంగహస్తాలతో
చంద్రుడిని తాకుతూ, పరమశివుని జుట్టును పట్టుకొని ఉంటుంది ఆవిడ.”
(హరిద్వారము దగ్గర ఉంటుంది ఈ కనఖలము అనే తీర్థము. అక్కడి పంచతీర్థాలలో ఒకటి.)
Comments
Post a Comment